రెడ్మీ నోట్ 4 రికార్డ్ సేల్, 10 నిమిషాల్లో 2,50,000 ఫోన్‌లు
10 నిమిషాల పాటు జరిగిన ఈ సేల్‌లో భాగంగా మొత్తం 2,50,000 రెడ్మీ నోట్ 4 యూనిట్లు అమ్ముడైనట్లు XiaomiIndia తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది.
షియోమీ నుంచి సోమవారం మార్కెట్లో విడుదలైన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, ఇండియన్ ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఓపెన్ సేల్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు Flipkart అలానే Mi.comలలో జరిగింది.

10 నిమిషాల పాటు జరిగిన ఈ సేల్‌లో భాగంగా మొత్తం 2,50,000 రెడ్మీ నోట్ 4 యూనిట్లు అమ్ముడైనట్లు XiaomiIndia తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. రెడ్మీ 3ఎస్ ఫోన్‌తో పోలిస్తే 3 రెట్టు, రెడ్మీ నోట్ 3తో పోలిస్తే 5 రెట్ల ఎక్కువ అమ్మకాలను ఈ మొదటి రెడ్మీ నోట్ 4 ఓపెన్ సేల్ నమోదు చేసినట్లు షియమీ ఇండియా తెలిపింది.

అతిపెద్ద ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ సేల్
ఇదిలా ఉండగా, రెడ్మీ నోట్ 4కు సంబంధించి సోమవారం జరిగిన మొదటి ఓపెన్ సేల్‌ను దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ సేల్‌గా షియోమీ ఇండియా ఈ-కామర్స్ పార్ట్‌నర్ అయిన Flipkart అభివర్ఱించింది.

20 లక్షల మంది యునిక్ కస్టమర్‌లు
రెడ్మీ నోట్ 4 ఫోన్‌కు సంబంధించి తమ వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసిన ప్రొడక్ట్ పేజీని 20 లక్షల మంది యునిక్ కస్టమర్‌లు సందర్శించినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇందులో 10 లక్షల మంది ‘notify me' రిక్వస్ట్ ఫీచర్‌ను వినియోగించుకున్నట్లు సదరు ఈ-కామర్స్ సైట్ పేర్కొంది. రెడ్మీ నోట్ 4 ఫోన్‌లకు సంబంధించిన తరువాతి ఫ్లాష్‌సేల్ జనవరి 30న జరుగుతుంది.

మూడు ర్యామ్ వేరియంట్లలో..
షియోమీ ఇండియా తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లను మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. డార్క్ గ్రే, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండే రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్
రెడ్మీ నోట్ 4 స్పెక్స్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్).

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్
4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.


Click it and Unblock the Notifications








