10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!

చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ భారత్‌లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Redmi Note 4 సునాయాశంగా 10 లక్షల అమ్మకాలను క్రాస్ చేసింది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఈ మార్క్‌ను క్రాస్ చేయటం విశేషం. రెడ్మీ నోట్ 4 అమ్మకాలు జనవరి 23, 2017నంచి ఫ్లిప్‌కార్ట్‌లో పారంభమయ్యాయి.

Read More : రేపటి నుంచే Moto G5 Plus అమ్మకాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు ర్యామ్ వేరియంట్లలో ...

షియోమీ ఇండియా తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లను మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. డార్క్ గ్రే, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండే రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

2016కుగాను భారతదేశపు మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న షియోమీ (Xiaomi) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతేడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పై సుమారు 6,700 కోట్ల వరకు ఆదాయాన్ని రాబట్టుకోగలిగిన షియోమీ రానున్న ఐదు సంవత్సరాల్లో భారతదేశపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించాలని చూస్తోంది.

భారత్‌లోనే తయారీ..

భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ సేల్స్ వాల్యుమ్‌ను మరింతగా పెంచుకునేందుకు షియోమీ ఇండియా తన భవిష్యత్ వ్యూహాలకు పొదునుపెడుతోంది. ఈ క్రమంలో ఉత్పాదక సామర్థ్యాలను పెంచుకునేందుకు మరిన్న ఫోన్ తయారీ ఫ్లాంట్‌లను భారత్‌లో నెలకొల్పబోతున్నట్లు షియోమీ ఇండియా అధిపతి మను జైన్ తెలిపారు.

Foxconn భాగస్వామ్యంతో...

Foxconn కంపెనీ భాగస్వామ్యంతో Xiaomi ఇప్పిటికే ఓ స్మార్ట్‌ఫోన్ తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఏర్పాటు చేసుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఒకటి లేదా రెండు ప్లాంట్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకోబోతున్నట్టు మును జైన్ తెలిపారు.

రెడ్మీ నోట్ 3 సూపర్ హిట్..

షియోమీ కంపెనీ నుంచి గతేడాది లాంచ్ అయిన రెడ్మీ నోట్ 3 ఫోన్ ఎంత హిట్టయ్యిందో మనందరికి తెలుసు. ఈ ఫోన్ లకు కేవలం కేవలం 10 నెలల వ్యవధిలో 36 లక్షల మంది కొనుగోలు చేసారు. షియోమీ గతేడాది తన Mi అలానే Redmi సిరీస్‌ల నుంచి మొత్తం 4 ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

అదే దూకుడుతో రెడ్మీ నోట్ 4...

ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన Redmi Note 4 స్మార్ట్‌ఫోన్, రెడ్మీ నోట్ 3తో పోలిస్తే రెట్టింపు అమ్మకాలను నమోదు చేయాలని తాము కోరుకుంటున్నట్లు జైన్ వెల్లడించారు. గతేడాదిలో భారత్‌లో అమ్ముడైన ఫియోమీ ఫోన్‌లలో 75% ఫోన్‌లు భారత్‌లో తయారైనవేనని మును జైన్ తెలిపారు.

అమ్మకాల సంఖ్య మరింతగా పెరిగింది..

గడచిన మూడేళ్లతో పోలిస్తే గతేడాది తమ్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల 3 రెట్లకు పెరిగాయని 2020 నాటికి ఈ సంఖ్యను మరింతగా పెంచేందుకు షియోమీ సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తుందని మను కుమార్ జైన్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi sells more than 1 million Redmi Note 4 units in 45 days. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot