ఇప్పటి వరకు 18 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మారు...

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Xiaomi బ్రాండ్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. రెండు రోజుల క్రితం రెడ్మీ 3ఎస్ ఫోన్ అమ్మకాలను ప్రకటించిన షియోమి తాజగా రెడ్మీ నోట్ 4 అమ్మకాలను వెల్లడించింది.

Read More : మీ కొత్త ఫోన్‌కు కొన్ని టిప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

18 లక్షల రెడ్మీ నోట్ 4 అమ్మకాలు...

భారత్‌లో రెడ్మీ నోట్ 4 ఫోన్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల యూనిట్‌లను విక్రయించగలిగిన్లు షియోమి ఇండియా డైరెక్టర్ మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

 

ఐడీసీ నివేదిక ప్రకారం..

ఇదే సమయంలో 2017 మొదటి క్వార్టర్‌కు అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌ల జాబితాను ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) రివీల్ చేసింది. ఈ ఫలితాల్లోనూ రెడ్మీ నోట్ 4 ముందంజలో నిలిచింది.

రెండవ స్థానంలో సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2016)..

రెండవ స్థానంలో గెలాక్సీ జే2 (2016) మోడల్ నిలిచింది. ఐడీసీ నివేదిక ప్రకారం 2017, క్యూ1కు గాను 39.8శాతం మార్కెట్ వాటాతో, భారత్‌లో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షియోమి నిలిచింది.

రెడ్మీ 4ఏ కూడా దుమ్మురేపుతోంది..

2017 ఆరంభంలో షియోమి నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. వాటిలో ఒకటి రెడ్మీ నోట్ 4 కాగా మరొకటి రెడ్మీ 4ఏ. ఈ రెండు ఫోన్‌లు ఆన్‌లైన్‌లో దుమ్ము రేపుతున్నాయి.

40.6 శాతం మార్కెట్ షేర్‌ షియోమీదే..

2017, క్యూ1లో జరిగిన ఆన్‌లైన్ అమ్మకాల్లోనూ షియోమి 40.6 శాతం మార్కెట్ షేర్‌ను నమోదు చేసినట్లు ఐడీసీ నివేదిక చెబుతోంది.

51.4 శాతం మార్కెట్ వాటా చైనా బ్రాండ్‌లదే..

గతకొన్ని సంవత్సరాలుగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్‌లు శాసిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వెల్లడైన ఫలితాల్లోనూ అదే మరోసారి రుజువైంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 2017, క్యూ1కు గాను స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 51.4 శాతం మార్కెట్ వాటాను చైనా బ్రాండ్‌లే చేజిక్కించుకున్నాయని ఐడీసీ నివేదిక రివీల్ చేసింది.

94.5శాతం స్మార్ట్‌ఫోన్‌లు 4G VoLTE ఫీచర్‌ను కలిగి ఉన్నవేనట

2017 మొదటి క్వార్టర్‌లో మొత్తం 27 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడుపోగా అందులో 40.6 శాతం మార్కెట్ వాటాతో షియమీ లీడింగ్ ఆన్‌లైన్ స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ క్వార్టర్‌లో అమ్ముడైన మొత్తం ఫోన్‌లలో 94.5శాతం స్మార్ట్‌ఫోన్‌లు 4G VoLTE ఫీచర్‌ను కలిగి ఉన్నవేనట.

మార్కెట్ షేర్ విషయానికి వచ్చేసరికి

ఇక మార్కెట్ షేర్ విషయానికి వచ్చేసరికి సామ్‌సంగ్ 28.1 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. రెండవ స్థానంలో నిలిచిని షియోమి 14శాతం మార్కెట్ వాటాతో దూసుకెళుతోంది.

మూడో స్థానంలో వివో..

మూడో స్థానంలో నిలిచిన వివో 10.5శాతం మార్కెట్ వాటాతో లెనోవో, ఒప్పోలకు ప్రధాన కాంపిటీటర్ గా నిలిచింది. నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతోన్న లెనోవో, ఒప్పోలు 9.5 శాతం, 9.3 శాతం మార్కెట్ వాటాలను కలిగి ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Sets Another Record by Selling 1.8 Million Units of Redmi Note 4 in Just Three Months. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot