భారీ తగ్గింపు ధరలలో షియోమి ఫోన్లు....ఆఫర్ రేపటి వరకే
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన Redmi 6A, Redmi 6 మరియు Redmi 6 Pro స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన Redmi 6A, Redmi 6 మరియు Redmi 6 Pro స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. అయితే తగ్గిన ధరలు ఫిబ్రవరి 8 వరకు మాత్రమే అమలులో ఉంటాయి.దీంతో పాటు ఈ మూడు మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్‌పై రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసిన వారికి 10% అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

Redmi 6A(2 జీబీ + 32 జీబీ)
అసలు ధర రూ.7,999
ఆఫర్ ధర రూ.6,499
ఫీచర్లు...
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi 6 (3 జీబీ + 64 జీబీ)
అసలు ధర రూ.10,499
ఆఫర్ ధర రూ.8,499
ఫీచర్లు...
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi 6 Pro
3 జీబీ + 32 జీబీ
అసలు ధర రూ.11,499,
ఆఫర్ ధర రూ.8,999
4 జీబీ + 64 జీబీ
అసలు ధర రూ.13,499
ఆఫర్ ధర రూ.10,999
ఫీచర్లు...
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








