నాలుగవ స్ధానానికి పడిపోయిన షియోమీ

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా కొనసాగుతోన్న షియోమీ (Xiaomi) చైనాలో మాత్రం 4వ స్ధానానికి పడిపోయింది. 2015తో పోలిస్తే 2016లో ఈ బ్రాండ్ తాలుకా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 22% తగ్గటంతో షియోమీ 4వ స్ధానానికి పరిమితమవ్వాల్సి వచ్చిందని శుక్రవారం విడుదలైన కౌంటర్ పాయింట్ రిసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.

Read More : మీ స్మార్ట్‌ఫోన్‌లు ఎంత మురికిగా ఉంటున్నాయో, మీకు తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీకి చెక్ పెట్టిన హువావే, వివో, ఒప్పో

న్యూ ఫీచర్స్, క్రియేటివిటీ, పెద్దమొత్తంతో మార్కెటింగ్ బడ్జెట్స్, వైడర్ ఆన్‌లైన్ మార్కెటింగ్, ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాల్లో షియోమీతో పోలిస్తే హువావే, వివో, ఒప్పోలు ముందంజలో ఉన్నాయని కౌంటర్ పాయింట్ రిసెర్చ్ తెలిపింది.

కొత్త ఫోన్‌ల రాకతో పెరిగిన అమ్మకాలు..

యాపిల్, ఒప్పో, హువావే, షియోమీ బ్రాండ్‌లు 2016, చివరి క్వార్టర్‌లో కొత్త ఫోన్‌లను ఆవిష్కరించటంతో అమ్మకాలు 12% పెరిగాయని కౌంటర్ రిసెర్చ్ తెలిపింది.

58% మార్కెట్ వాటా వాటిదే..

2016కు గాను చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఒప్పో, హువావే, వివో, మిజు,
జియోనీలు 58% మార్కెట్ వాటాను కైవసం చేసుకోగలిగాయి. ఇదే సమయంలో షియోమీ, యాపిల్ వంటి ప్రముఖ బ్రాండ్ లు ఫేలవమైన వృద్ధి రేటుతో అంచనాలను అందుకోలేకపోయాయని కౌంటర్ పాయింట్ రిసెర్చ్ డైరెక్టర్ జేమ్స్ యాన్ తెలిపారు.

ఎక్కువుగా దృష్టి సారించిన ఫీచర్లు

ఇక ఫీచర్ల విషయానికి వచ్చేసరికి 2016కు గాను ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, 4జీ విత్ VoLTE, ఫాస్ట్ ఛార్జింగ్, OLED డిస్‌ప్లే, బ్యాటరీ, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, హై మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటి అంశాల పై చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఎక్కువుగా దృష్టి సారించినట్లు ఈ రిసెర్చ్ ద్వారా తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi slips to fourth position in China; Oppo and Vivo take the lead. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting