Xiaomi సంచలనం, ఇండియాలో 2.5 కోట్ల ఫోన్‌లు అమ్మేసారు
ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమి హవా కొనసాగుతోంది.
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో మైలురాయిని అధిగమించినట్లు షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జెయిన్ వెల్లడించారు. తాము 2014లో, ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన నాటినుంచి ఇప్పటి వరకు 25 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు ఆయన తెలిపారు.

ఈ విశ్లేషణ ప్రకారం చూస్తే..
ఈ విశ్లేషణ ప్రకారం చూస్తే, గత మూడు సంవత్సరాలుగా షియోమి, రోజుకు 22,000 స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమి హవా కొనసాగుతోంది. ఇందుకు కారణం ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అవుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లే.

Redmi Note 4 రికార్డుల మోత...
ఈ ఏడాదికిగాను షియోమీ నుంచి లాంచ్ అయిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లు అమ్మకాల సునామీని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా Redmi Note 4 సరికొత్త బెంచ్ మార్క్‌ను సృష్టించింది. జనవరి 2017లో లాంచ్ అయిన ఈ ఫోన్ ను ఇప్పటి వరకు 50 లక్షల పై చిలుకు మంది యూజర్లు కొనుగోలు చేసారు.

అదే ట్రెండ్ కొనసాగిస్తోన్న Redmi 4A, Redmi 4..
Redmi Note 4 తరువాత మార్కెట్లో లాంచ్ అయిన Redmi 4A, Redmi 4 స్మార్ట్‌ఫోన్‌లు అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 10 మిలియన్ మార్క్‌ను షియోమి క్రాస్ చేసే అవకావముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

త్వరలో డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్..
మరికొద్ది రోజుల్లో షియోమి తన మొట్టమొదటి డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ కూడా మార్కెట్లో వర్క్‌అవుట్ అయినట్లయితే షియోమి సక్సెస్ రేట్ మరింత పెరిగే అవకాశముంటుంది.

త్వరలోనే సామ్‌సంగ్ ఆధిపత్యానికి చెక్..
ఇక మార్కెట్ షేర్ విషయానికి వచ్చేసరికి సామ్‌సంగ్, షియోమిల మధ్య కేవలం 3% మాత్రమే వ్యత్యాసమున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌ను త్వరలోనే షియోమీ అధిగమించే అవకావముంది.


Click it and Unblock the Notifications