8 నిమిషాల్లో 90,000 ఫోన్‌లు, దుమ్ము రేపిన Redmi 3s Prime

బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ సంగ్రామానికి తెరలేపుతూ xiaomi తన రెడ్మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను గత వారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌కు సంబంధించిన మొదటి సేల్ నిన్న mi.com అలానే Flipkartలలో ఎక్స్‌క్లూజివ్‌గా జరిగింది.

 8 నిమిషాల్లో 90,000 ఫోన్‌లు, దుమ్ము రేపిన Redmi 3s Prime

Read More : శవ పరీక్షలలో సరికొత్త కోణం!

ఈ సేల్ నిమిత్తం అందుబాటులో ఉంచిన 90,000 షియోమీ రెడ్మీ 3ఎస్ యూనిట్లు కేవలం 8 నిమిషాల్లో అమ్ముడైపోయాయిని షియోమీ ఇండియా హెడ్ మను జైన్ తెలిపారు. ఈ ఫోన్‌లు సంబంధించిన తరువాత ఓపెన్ సేల్ ఆగష్టు 17న జరుగుతుంది. రూ.8,999 ధర ట్యాగ్‌తో 3 జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి శక్తివంతమైన పటిష్టమైన ఫీచర్లను కలిగి ఉన్న రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ప్రత్యేతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ స్పెసిఫికేషన్స్

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌ రెడ్మీ నోట్ 3కి దగ్గరగా ఉంటుంది. ఈ ఫోన్‌ మందం 8.5 మిల్లీ మీటర్లు. బరువు విషయానికి వచ్చేసరికి 144 గ్రాములు. మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్‌ ప్రీమియమ్ లుక్‌ను కలిగిస్తుంది.

శక్తివంతమైన బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

ప్రాసెసర్, ర్యామ్

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ప్రైమ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

ఇంటర్నల్ స్టోరేజ్

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

హైడెఫినిషన్ డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి.. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 720x 1280పిక్సల్స్.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. (ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, హెచ్‌డీఆర్, హెచ్‌హెచ్‌టీ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి)

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయి.

కనెక్టువిటీ ఫీచర్లు..

 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్. రెడ్మీ 3ఎస్ ప్రైమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi sold 90,000 Redmi 3s Prime units in 8 minutes: Manu Jain The new Xiaomi. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot