5 నిమిషాల్లో రూ.200 కోట్లు వసూలు, షాకిచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్

చైనా దిగ్గజం షియోమి సబ్ బ్రాండ్ పోకో ఇండియాలో దుమ్మురేపింది. ఈ కంపెనీ నుంచి తొలిసారిగా అమ్మకానికి వచ్చిన Poco F1 స్మార్ట్‌ఫోన్ మొదటి ఫ్లాష్ సేల్ లోనే దిగ్గజాలకు దడ పుట్టించింది.

|

చైనా దిగ్గజం షియోమి సబ్ బ్రాండ్ పోకో ఇండియాలో దుమ్మురేపింది. ఈ కంపెనీ నుంచి తొలిసారిగా అమ్మకానికి వచ్చిన Poco F1 స్మార్ట్‌ఫోన్ మొదటి ఫ్లాష్ సేల్ లోనే దిగ్గజాలకు దడ పుట్టించింది. ఈ నెల 29న ఫ్లిప్ కార్ట్ లో ఫ్లాష్ సేల్ కింద అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్ కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే రూ. 200 కోట్ల అమ్మకాలను రాబట్టింది. ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఫ్లాగ్ షిప్ సేల్ గా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొత్త చరిత్రను లిఖించింది. ఇండియాలో ఇంతటి ఘన విజయాన్ని నమోదు చేసిన ఈ ఫోన్ ను చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యానికి గురి అయ్యాయి. ఈ విజయాన్ని కంపెనీ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటోంది.

శాస్త్రవేత్తలకు షాకిచ్చిన 15 ఏళ్ల కుర్రాడు, వేల ఏళ్ల చరిత్రను బయటకు..శాస్త్రవేత్తలకు షాకిచ్చిన 15 ఏళ్ల కుర్రాడు, వేల ఏళ్ల చరిత్రను బయటకు..

ఎన్ని యూనిట్లను అమ్మకానికి ..

ఎన్ని యూనిట్లను అమ్మకానికి ..

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి ఎప్పుడు వస్తుందా అనే షియోమి అభిమానులు ఎదురుచూపులు ఫలించాయి. అనుకున్న సమయానికే ఫోన్ ప్లాష్ సేల్ కి రావడంతో అభిమానులు ఫోన్ కోసం పోటీ పడ్డారు. కంపెనీ ఎన్ని యూనిట్లను అమ్మకానికి ఉంచుతుందనే విషయం బహిర్గతం చేయనప్పటికీ చాలా ఎక్కువగానే అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

కంపెనీ ట్విట్టర్ ద్వారా..

ఇదే విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన యూజర్లకు ధన్యవాదాలు చెబుతూ కంపెనీ ట్వీట్ చేసింది. ఈ ఫోన్ తదుపరి సేల్ సెప్టెంబర్ 5న ఉంటుందని కంపెనీ ఈ ట్విట్లో తెలిపింది.

షియోమీ పోకో ఎఫ్1 ఫీచర్లు
 

షియోమీ పోకో ఎఫ్1 ఫీచర్లు

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

ధరలు

ధరలు

పోకో ఎఫ్1 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.20,999
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.23,999
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.28,999
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్, కెవ్లార్ ఆర్మర్డ్ ఎడిషన్ - రూ.29,999

ఆఫర్స్

ఆఫర్స్

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.1000 డిస్కౌంట్ ఇస్తారు. అలాగే ఈ ఫోన్‌పై జియో 6 టీబీ వరకు అదనపు డేటాను ఉచితంగా ఇస్తున్నది. అలాగే రూ.8వేల విలువైన ఇన్‌స్టంట్ బెనిఫిట్స్‌ను అందిస్తుంది.

భారీ డిస్‌ప్లే, ప్రాసెసర్

భారీ డిస్‌ప్లే, ప్రాసెసర్

ఈ ఫోన్‌లో 6.18 ఇంచుల భారీ డిస్‌ప్లేను అమర్చారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది.

 కెమెరాలు

కెమెరాలు

వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయం కల్పించారు. కేవలం 0.4 సెకన్ల వ్యవధిలోనే దీంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

పోకో ఎఫ్1 ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఈ ఫోన్‌లో లభిస్తున్నది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్....

ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్....

ఐఫోన్ ఎక్స్ తరహా notch స్క్రీన్ కూడిన 6.18 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో షియోమీ ఏర్పాటు చేసింది . ప్రీమియమ్ మెటల్ యునిబాడీతో రాబోతోన్న ఈ ఫోన్ ఏకంగా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఆర్ ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీని కూడా ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది . యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

లిక్విడ్ కూలింగ్ సిస్టమ్.....

లిక్విడ్ కూలింగ్ సిస్టమ్.....

ఈ ఫోన్‌లలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ హీటింగ్‌ను నిరోధించి ఫోన్ పనితీరును రెట్టింపు చేస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Poco says it sold Poco F1 phones worth over Rs 200 crore in 5 minutes in first sale more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X