సెకనుకు ఒక Redmi ఫోన్ తయారువుతోంది

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను Xiaomi శాసిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అవుతోన్న Redmi సిరీస్ ఫోన్‌లు పోటాపోటీగా రికార్డులు బద్దలుకొడుతున్నాయి. సంవత్సరం క్రితం వరకు ఆన్‌లైన్ మార్కెట్‌కు మాత్రమే పరిమితైన షియోమి ఫోన్‌లు ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్ మార్కెట్లో 90శాతం, ఆఫ్‌లైన్ మార్కెట్లో 10శాతం సేల్

రెడ్మీ ఫోన్‌లకు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ అదే ఊపు కొనసాగుతుండటంతో ఈ మార్కెట్‌ను మరింతగా విస్తరించుకోవాలిని షియోమి భావిస్తోంది. ప్రస్తుతం షియోమీ అమ్మకాలు ఆన్‌లైన్ మార్కెట్లో 90శాతం గానూ, ఆఫ్‌లైన్ మార్కెట్లో 10శాతంగానూ ఉన్నాయి.

25 శాతానికి పెంచాలన్నది లక్ష్యం..

ఈ ఏడాది చివరినాటికి ఆఫ్‌లైన్ మార్కెట్ సేల్‌ను 25 శాతానికి పెంచాలన్నది తమ లక్ష్యమని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ మీడియాకు తెలిపారు.

సెకనుకు ఒక ఫోన్ తయారవుతోంది...

తమ ఫోన్‌లు తయారయ్యేందుకు శ్రీ సిటీ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో రెండు తయారీ యూనిట్లు ఉన్నాయిని, వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం వరకు మహిళలేనని మను కుమార్ జైన్ తెలిపారు. ఈ యూనిట్లలో సెకనకు ఒక ఫోన్ తయారువుతోందని, వారానికి 3 లక్షల ఫోన్‌లు విక్రయించ గలుగుతున్నామని ఆయన వివరించారు.

Mi Home

క్రిందటి నెలలో షియోమి తన మొట్టమొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను Mi Home పేరుతో బెంగుళూరులో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మే 20న అఫీషియల్‌గా ప్రారంభమైన ఈ స్టోర్ మొదటి 12 గంటల్లోనే 5 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది.

షియోమి ఎంఐ స్టోర్‌లలో ఫోన్‌లను కొనుగోలు చేసే అవకాశం

షియోమి ఎంఐ స్టోర్‌లలో ఆ బ్రాండ్‌కు సంబంధించిన అన్ని స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. వీటిని ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

రానున్న రెండేళ్లలో 100 స్టోర్లు...

రానున్న రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మరో 100 Mi Home Storeలను లాంచ్ చేయనున్నట్లు షియోమీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇంకా చెన్నై వంటి మెట్రో నగరాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10,000 వరకు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో షియోమీ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi targets 25% sales via offline model this year. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting