Redmi రికార్డులు బ్రేక్ చేస్తుందా?, టార్గెట్ 70 లక్షల Note 4 ఫోన్‌లు

2016కుగాను భారతదేశపు మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న షియోమీ (Xiaomi) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతేడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పై సుమారు 6,700 కోట్ల వరకు ఆదాయాన్ని రాబట్టుకోగలిగిన షియోమీ రానున్న ఐదు సంవత్సరాల్లో భారతదేశపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించాలని చూస్తోంది.

Read More : సామ్‌సంగ్‌కు షాక్, 10 అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్ వ్యూహాలకు పొదునుపెడుతోంది

భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ సేల్స్ వాల్యుమ్‌ను మరింతగా పెంచుకునేందుకు షియోమీ ఇండియా తన భవిష్యత్ వ్యూహాలకు పొదునుపెడుతోంది. ఈ క్రమంలో ఉత్పాదక సామర్థ్యాలను పెంచుకునేందుకు మరిన్న ఫోన్ తయారీ ఫ్లాంట్ లను భారత్ లో నెలకొల్పబోతున్నట్లు షియోమీ ఇండియా అధిపతి మను జైన్ ఓ ప్రముఖ మీడియాకు తెలిపారు.

Foxconn భాగస్వామ్యంతో...

Foxconn కంపెనీ భాగస్వామ్యంతో Xiaomi ఇప్పిటికే ఓ స్మార్ట్‌ఫోన్ తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఏర్పాటు చేసుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఒకటి లేదా రెండు ప్లాంట్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకోబోతున్నట్టు మును జైన్ తెలిపారు.

రెడ్మీ నోట్ 3 ఫోన్

షియోమీ కంపెనీ నుంచి గతేడాది లాంచ్ అయిన రెడ్మీ నోట్ 3 ఫోన్ ఎంత హిట్టయ్యిందో మనందరికి తెలుసు. ఈ ఫోన్ లకు కేవలం కేవలం 10 నెలల వ్యవధిలో 36 లక్షల మంది కొనుగోలు చేసారు. షియోమీ గతేడాది తన Mi అలానే Redmi సిరీస్‌ల నుంచి మొత్తం 4 ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

75% ఫోన్‌లు భారత్‌లో తయారైనవే..

ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన Redmi Note 4 స్మార్ట్‌ఫోన్, రెడ్మీ నోట్ 3తో పోలిస్తే రెట్టింపు అమ్మకాలను నమోదు చేయాలని తాము కోరుకుంటున్నట్లు జైన్ వెల్లడించారు. గతేడాదిలో భారత్‌లో అమ్ముడైన ఫియోమీ ఫోన్‌లలో 75% ఫోన్‌లు భారత్‌లో తయారైనవేనని మును జైన్ తెలిపారు.

3 రెట్లు పెరిగిన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు

గడచిన మూడేళ్లతో పోలిస్తే గతేడాది తమ్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల 3 రెట్లకు పెరిగాయని 2020 నాటికి ఈ సంఖ్యను మరింతగా పెంచేందుకు షియోమీ సరికొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తుందని మను కుమార్ జైన్ తెలిపారు.

యాపిల్ ఆఫ్ చైనా

‘యాపిల్ ఆఫ్ చైనా'గా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీని ప్రముఖ పారిశ్రామికవేత్త లీ జన్ (Lei Jun) ఏప్రిల్ 6, 2010న ప్రారంభించారు. చైనా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న షియోమీ సంస్థకు చైర్మన్ ఇకా సీఈఓగా ఈయనే వ్యవహరిస్తున్నారు.

అధికారిక మాస్కట్ బన్నీ ఇదే

షియోమి అధికారిక మాస్కట్ బన్నీ ఇదే. పేరు మిటు (Mitu). చైనా భాషలో షియోమి ఇంటే 'చిన్న రైస్' ( little rice) అని అర్థం. షియోమి సంస్థను యాపిల్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. సంస్థ వ్యవస్థాపకులైన లీ జన్ ను ‘స్టీవ్‌‌జాబ్స్ ఆఫ్ చైనా'గా పిలుస్తారు.

మాజీ గూగుల్ ఉద్యోగులే..

షియోమి కంపెనీలో మొదటి 9 లీడర్ షిప్ స్థానాల్లోని మూడు స్థానాలను మాజీ గూగుల్ ఉద్యోగులే దక్కించుకున్నారు. వారి వివరాలు లిన్ బిన్ (సహ వ్యవస్థాపకులు ఇంకా అధ్యక్షుడు), హాంగ్ ఫింగ్ (సహ వ్యవస్థాపకులు ఇంకా ఉపాధ్యక్షుడు), హ్యూగో బర్రా, వైస్ ప్రెసిడెంట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi targets sales of 7 million units of Redmi Note 4 in 2017. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot