గ్లోబల్ లాంచ్‌కు సిద్థమవుతోన్న Mi Max 3
చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి (Xiaomi), మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షియోమి (Xiaomi), మరో శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది.చైనా మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతోన్న ఎంఐ మాక్స్ 3 (Mi Max 3) త్వరలోనే భారత్ సహా అన్ని ప్రముఖ మార్కెట్లలోకి అడుగుపెట్టబోతోంది. అక్టోబర్‌లో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఈ కీలక వివరాలను షావోమి గ్లోబల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ అయ్యాయి.

షియోమి ఎంఐ మాక్స్ 3 స్పెసిఫికేషన్స్..
6.9 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080×2160 పిక్సల్స్) విత్ 18:9 యాస్పెక్ట్ రేషియో, లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన ఎంఐయూఐ కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్‌సెట్ విత్ అడ్రినో 509 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి. 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5500ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, కెనక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి డ్యుయల్ 4జీ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్ 5,0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

ధరలు వివరాలు..
చైనా మార్కెట్లో షియోమి ఎంఐ మాక్స్ 3కి సంబంధించి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 1699 Yuan ( ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.17,800)లుగా ఉంది. 6 జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 1999 Yuan ( ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.21,700)లుగా ఉంది. ఇండియన్ మార్కెట్లో వీటి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయ్ అనేదాని పై ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ న్యూస్ అందుబాటులో లేదు. ఎంఐ మాక్స్ 3కి ముందు మోడల్ అయిన ఎంఐ మాక్స్ 2 ధర ఇండియన్ మార్కెట్లో రూ.16,999గా ఎంది.

ఎంఐ మ్యాక్స్ 2 స్పెసిఫికేషన్స్..
6.44 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ.

హానర్ 8ఎక్స్ మాక్స్ నుంచి తీవ్రమైన పోటీ..
ఎంఐ మాక్స్ 3 స్మార్ట్‌ఫోన్‌కు ఇండియన్ మార్కెట్లో త్వరలో లాంచ్ కాబోతోన్న హానర్ 8ఎక్స్ మాక్స్ స్మార్ట్‌ఫోన్ నుంచి ప్రధానమైన పోటీ ఎదురుకాబోతోందట. హానర్ 8ఎక్స్ మాక్స్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 7.12 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్‌సెట్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ రేర్ కెమెరా సపోర్ట్.


Click it and Unblock the Notifications