Home
Mobile

షియోమి సంచలనం ,మార్కెట్లోకి ఒకేసారి 3 స్మార్ట్‌ఫోన్లు !

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమీ అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది.

By Hazarath Aiah

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం Xiaomi అభిమానులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వారం ఒకే రోజు మూడు స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేయబోతోంది. సెప్టెంబరు 5న రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ప్రొ, రెడ్‌మీ 6ఎలను విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ఓ ట్వీట్‌లో తెలిపారు. కాగా ఈ మూడింటినీ జూన్‌లోనే చైనాలో లాంచ్ చేసిన Xiaomi ఇప్పుడు ఇండియాలోనూ లాంచింగ్‌కు రెడీ అయింది. కాగా ఇటీవల ఈ సంస్థ నుంచి వచ్చిన రెడ్‌మీ 5, రెడ్‌మీ 5ఎలకు భారత్‌లో విశేష స్పందన లభించడంతో వీటికి సక్సెసర్‌గా వీటిని తీసుకొస్తోంది.రెడ్‌మి 6, రెడ్‌మీ 6 ప్రొ, రెడ్‌మీ 6ఎ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

షియోమి రెడ్‌మి 6

షియోమి రెడ్‌మి 6

ధర: 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.8,410, రూ.10,520.
గ్రే, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో లభ్యం
షియోమి రెడ్‌మి 6 ఫీచర్లు
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి రెడ్‌మి 6ఏ

షియోమి రెడ్‌మి 6ఏ

ధర రూ.6307
షియోమి రెడ్‌మి 6ఏ ఫీచర్లు
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 షియోమి రెడ్‌మి 6 ప్రొ

షియోమి రెడ్‌మి 6 ప్రొ

3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ రూ.10,520, రూ.13,555 ధరలకు వినియోగదారులకు లభిస్తోంది.రోజ్ గోల్డ్, గోల్డ్, బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో అందుబాటు.
షియోమి రెడ్‌మి 6 ప్రొ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి రెడ్‌మి 5

షియోమి రెడ్‌మి 5

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల ధరలు వరుసగా రూ.7,999, రూ.8,999, రూ.10,999.
షియోమి రెడ్‌మి 5 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

షియోమి రెడ్‌మి 5 ప్లస్

షియోమి రెడ్‌మి 5 ప్లస్

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన రెడ్‌మీ 5 ప్లస్ రూ.9,745, రూ.12,675 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.
షియోమి రెడ్‌మి 5 ప్లస్ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమి రెడ్‌మి 5ఏ

షియోమి రెడ్‌మి 5ఏ

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో రూ.5,999, రూ.6,999 ధరలకు లభిస్తున్నది.
షియోమి రెడ్‌మి 5ఏ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi to launch three Redmi 6-series smartphones on September 5: Know more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X