వన్‌ప్లస్‌కు దడపుట్టించిన షియోమి,Mi 8 రికార్డు అమ్మకాలు

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా కంపెనీలు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది.

|

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా కంపెనీలు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. సెల్ఫీ స్మార్ట్‌ఫోన్లో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ వన్‌ప్లస్‌ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6ను లాంచ్ చేసిన 22 రోజుల్లో వన్ మిలియన్ యూనిట్లను విక్రయించగా ఈ రికార్డును షియోమి కేవలం 18 రోజుల్లోనే అధిగమించింది. ఈ ఫోన్ జూన్ 5న మార్కెట్లో అమ్మకానికి వెళ్లిన విషయం తెలిసిందే.ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌ 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసిందన్న విషయాన్ని కంపెనీ గ్లోబల్‌ అధికార ప్రతినిధి డోనోవాన్‌ సంగ్‌ ట్విటర్‌ ద్వారా ధృవీకరించారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌కు 22 రోజుల సమయం పట్టింది. అంటే వన్‌ప్లస్‌ 6 రికార్డులను ఎంఐ 8 బద్దలు కొట్టేసిందన్న మాట.

 

ఆన్‌లైన్‌‌ ఆర్డర్‌కి బిజెపిలో జాయిన్‌కు లింకేంటి,లబోదిబోమన్న కస్టమర్ !ఆన్‌లైన్‌‌ ఆర్డర్‌కి బిజెపిలో జాయిన్‌కు లింకేంటి,లబోదిబోమన్న కస్టమర్ !

షియోమీ ఎంఐ8 ఫీచర్లు

షియోమీ ఎంఐ8 ఫీచర్లు

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర

ధర

బ్లాక్, బ్లూ, గోల్డ్, వైట్ కలర్ వేరియెంట్లలో ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్ వేరియెంట్లు లభిస్తున్నాయి. ఎంఐ8 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.28,460 ధరకు లభ్యమవుతుండగా, 128 జీబీ స్టోరేజ్ వేరియెట్ రూ.31,620 ధరకు, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.34,785 ధరకు లభ్యం అవుతున్నాయి. ఇండియాకి త్వరలో వచ్చే అవకాశం ఉంది.

భారీ డిస్‌ప్లే
 

భారీ డిస్‌ప్లే

ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌లో 6.21 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల డివైస్‌కు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను అమర్చడం వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.

కెమెరా

కెమెరా

వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చగా ముందు భాగంలో 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది ఐఫోన్ X తరహాలో పనిచేస్తుంది.

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

ధర

ధర

వన్‌ప్లస్‌ 6 ప్రస్తుతం రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో భారత మార్కెట్‌లో లభిస్తోంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలుగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Xiaomi’s Mi 8 breaks OnePlus 6 record, sells 1 million units in just 18 days More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X