షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ Pocophone F1
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. పోకోఫోన్ (Pocophone) సిరీస్ నుంచి ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ఫోన్‌లకు సంబంధించి ఓ ఆసక్తికర వివరాలను షావోమి ఇండియా లీడ్ ప్రొడక్ట్ మేనేజర్ జై మణి తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసారు. ఈ ట్వీట్‌లో Poco by Xiaomi పేరుతో ఓ ఇమేజ్‌ను పోస్ట్ చేయటంతో పాటు 'ఈ రోజు చాలా స్పెషల్ డే, ఓ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మీతో షేర్ చేస్తున్నందుకు చాలా ఉత్తేజకరంగా ఫీల్ అవుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. @IndiaPOCO @GlobalPocophone." అంటూ ఓ సందేశాన్ని జై మణి పోస్ట్ చేసారు.

Pocophone గురించి గత కొంత కాలంగా అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రూమర్స్ ప్రకారం పోకోఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్ క్రిందకు రాబోతోంది. పోకోఫోన్ సిరీస్ నుంచి విడుదలయ్యే మొదటి ఫోన్ Pocophone F1 పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్, 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ క్యారీ చేయబోతోంది. ఈ ఫోన్‌లలో ఏర్పాటు చేయబోతోన్న ప్రత్యేకమైన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ హీటింగ్‌ను నిరోధించి ఫోన్ పనితీరును రెట్టింపు చేస్తుందట.
ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్..
ఐఫోన్ ఎక్స్ తరహా notch స్ర్కీన్‌తో కూడిన 6.8 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో షావోమి ఏర్పాటు చేసిందట. ప్రీమియమ్ మెటల్ యునిబాడీతో రాబోతోన్న ఈ ఫోన్ ఏకంగా 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఆర్ ఫేస్ అన్‌లాక్ టెక్నాలజీని కూడా ఈ కెమెరా సపోర్ట్ చేస్తుందట. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
మార్కెట్లోకి Mi A2..
ఇక కొత్త ఆవిష్కరణల విషయానికి వచ్చేసరికి షావోమి ఇటీవలే తన రెండవ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Mi A2 పేరుతో ఈ ఫోన్ లభ్యబవుతోంది. అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోన్న ఈ డివైస్ ధర రూ.16,999గా ఉంది.


Click it and Unblock the Notifications








