పెద్దతెర స్మార్ట్‌ఫోన్ జోలో ఏ600 విడుదల: తక్కువ ధరలో
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ బ్రాండ్ జోలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో ‘జోలో ఏ600' పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. జోలో అధికారిక వెబ్‌సైట్ ఈ పెద్దతెర ఫోన్ ధరను రూ.8,199గా పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్ల వద్ద ఈ హ్యాండ్‌సెట్ లభిస్తోంది.

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే, జోలో ఏ600 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఎంటీ 6572డబ్ల్యూ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఐపీఎస్ డిస్‌ప్లేతో కూడిన 4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ 960x 540పిక్సల్ రిసల్యూషన్ సామర్ధ్యంతో గొప్ప వీక్షణా అనుభూతులను చేరువచేస్తుంది. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను ఫోన్‌లో లోడ్ చేసారు. 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని మరింతగా విస్తరించుకునే సౌలభ్యత, డ్యూయల్ సిమ్ సపోర్ట్, క్రోయూఎస్బీ కనెక్టువిటీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా.
ప్రత్యేక ఫీచర్లు: వాయిస్ కాలింగ్ సపోర్ట్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్.
కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, ఎఫ్ఎమ్ రేడియో సపోర్ట్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications