తక్కువ రేటుకే భారీ ఫీచర్లతో Xolo స్మార్ట్‌ఫోన్

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Xolo తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Era 1X Proను శనివారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.5,888. Snapdeal ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. జూలై 31లోపు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి ఏడాదిలోపు వన్ టైమ్ స్ర్కీన్ రీప్లేస్‌మెంట్ ఉచితంగా లిభిస్తుంది.

తక్కువ రేటుకే భారీ ఫీచర్లతో Xolo స్మార్ట్‌ఫోన్

Era 1X Pro స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ720× 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ చిప్‌సెట్ విత్ 1.5గిగాహెట్జ్ సీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్). ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన కెమెరా యాప్ Slow Motion Video, Time Lapse Video, Live Photos వంటి ప్రత్యేక మోడ్స్‌ను ఆఫర్ చేస్తుంది.

English summary
Xolo Era 1X Pro With 4G VoLTE and Android Marshmallow Launched at Rs.5,888. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot