జోలో నుంచి ఆక్టాకోర్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జోలో ప్లే 8ఎక్స్-1100 పేరుతో సరికొత్త ఆక్టాకోర్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 5 అంగుళాల డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉన్న ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధర రూ.14,999. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. గేమింగ్‌కు అనువుగా మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ను హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసారు.

జోలో ప్లే 8ఎక్స్-1100 కీలక ఫీచర్లు:
డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (2జీ+3జీ),
5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ తాకేతెర (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
మాలీ 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు),
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్, జీపీఎస్, ఎజీపీఎస్, హైడెఫినిషన్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications