జోలో 4జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

|

4జీ సపోర్ట్ కనెక్టువిటీ ఫీచర్‌తో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను జోలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. జోలో ఎల్‌టీ శ్రేణి నుంచి తొలిగా వస్తున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ మోడల్ ‘ఎల్టీ900'. ధర రూ.17,999.

 
జోలో 4జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

జోలో అధికారిక వెబ్‌సైట్‌‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర ఇంకా ఇతర స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. అయితే, మార్కెట్లో డివైజ్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

4జీ ఎల్టీఈ సపోర్ట్,
4.2 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ వన్ గ్లాస్ సొల్యూషన్, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, రిసల్యూషన్ 720x1280పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8960 స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (క్లాక్‌వేగం 384 మెగాహెట్జ్),
1జీబి రామ్,
8 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్),
1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1810ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15 గంటల టాక్‌టైమ్ (2జీ నెట్‌వర్క్), 362 గంటల స్టాండ్‌బై టైమ్ (2జీ నెట్‌వర్క్),
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ - ఏజీపీఎస్),
ప్రీలోడెడ్ ఫీచర్లు: స్కైప్, బిడ్ ఫ్లెక్స్, కెప్లర్ క్లౌడ్ స్పేస్, ఎయిర్‌టెల్ మొబైల్ టీవీ యాప్స్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X