నవంబర్‌లోనే భారతదేశపు తొలి 4జీ స్మార్ట్‌ఫోన్!

Posted By:

భారతదేశపు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలలో ఒకటైన జోలో (Xolo) తన మొట్టమొదటి 4జీఎల్టీఈ ఫోన్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. మరోవైపు మైక్రోమ్యాక్స్ తన మొట్టమొదటి 4జీ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

నవంబర్‌లోనే భారతదేశపు తొలి 4జీ స్మార్ట్‌ఫోన్!

4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే జోలో స్మార్ట్‌ఫోన్ పేరు ‘ఎల్ టి900'. జీఎస్ఎమ్ అరీనా ప్రచురించిన వివరాల మేరకు ఈ డివైజ్‌ను నవంబర్ మొదటి వారంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనుమానాస్పద ఫోటోను కూడా ఆ సైట్ ప్రచరించటం జరిగింది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లు (అంచనా మాత్రమే):

4.3 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఓజీఎస్ డిస్‌ప్లే (341 పీపీఐ),
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ఎమ్ఎస్ఎమ్8960 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్),
8 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్,
అడ్రినో 225 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2.2 ఆపరేటింగ్ సిస్టం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot