గెస్ట్యర్ కంట్రోల్ ఫీచర్‌తో జోలో క్యూ1200 స్మార్ట్‌ఫోన్ విడుదల
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జోలో ‘క్యూ1200' పేరుతో తన సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.13,999.

గెస్ట్యర్ కంట్రోల్, డబల్ ట్యాప్ టూ అన్‌లాక్, డ్యూయల్ విండో వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ సింగిల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 10 నుంచి రిటైల్ మార్కెట్లో విక్రయించనున్నారు. ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (720పిక్సల్ రిసల్యూషన్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం), 1.3మెగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6582 క్వాడ్-కోర్ ప్రాసెసర్.

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకమైన సోనీ ఎక్స్‌మార్ సెన్సార్ ప్రత్యేకతతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.0).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications