జోలో క్యూ3000 ఫాబ్లెట్ విడుదల
జోలో క్యూ3000 ఫాబ్లెట్‌ను మంగళవారం దేశీయ విపణిలో విడుదల చేసారు. ధర రూ.20,999. ఔత్సాహికులు ఈ 5 అంగుళాల ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఫాబ్లెట్‌ను బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో సొంతం చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్‌లు.......

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), 386 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6589టీ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ 2 సెన్సార్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్). 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (33 గంటల టాక్‌టైమ్ (2జీ నెట్‌వర్క్ పై ), 667 గంటల స్టాండ్‌బై టైమ్ (2జీ నెట్‌వర్క్ పై).
జోలో క్యూ3000 ఫాబ్లెట్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే....
3జీ, వై-ఫై,
మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
యాక్సిలరోమీటర్, గైరోస్కోప్,
మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్,
యాంబియంట్ లైట్ సెన్సార్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications