ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టంతో జోలో క్యూ600ఎస్
బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో మోటరోలా మోటో ఇ సంచలనాలు సృష్టిస్తున్న నేపధ్యంలో దేశవాళీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అదే తరహాలో తమ వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా ‘జోలో క్యూ600ఎస్' (Xolo Q600s) పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.8,499. వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ రూ.7,499 ప్రత్యేక ధర పై ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960×540పిక్సల్స్, వన్ గ్లాస్ సొల్యూషన్),
సూపర్ స్మూత్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ),
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (11 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 47.6 గంటల టాక్‌టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications