జోలో క్యూ900టీ@రూ.11,999
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జోలో తన క్యూ సిరీస్ నుంచి క్యూ900టీ (Q900T) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.11,999. గతేడాది విడుదలైన క్యూ900కు ఈ ఫోన్ అప్‌గ్రేడెడ్ వర్షన్. 4.7 అంగుళాల హైడెఫినిషన్ తాకే తెర, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం 3జీ కనెక్టువిటీ వంటి అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లను ఈ డివైస్‌లో నిక్షిప్తం చేసారు. జోలో క్యూ900టీ కీలక స్పెసిఫికేషన్‌లను మరోసారి పరిశీలిద్దాం..

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 312 పీపీఐ),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ (ఎంటీ6589 టర్బో) ప్రాసెసర్,
పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్),
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
సీన్ డిటెక్షన్, ట్యూనింగ్ హైడైనమిక్, హెచ్‌డీఆర్, తక్కువ వెళుతురులోనూ చక్కటి ఎడ్జస్ట్‌మెంట్, ఫేస్ రికగ్నిషన్, వెర్టికల్ ఇంకా హారిజంటల్, పానోరమా, జియో ట్యాగింగ్ వంటి ప్రత్యేకతలు కెమెరాలో ఉన్నాయి. మార్కెట్లో జోలో క్యూ900టీ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications