ఎక్స్ పీరియో ఆర్క్ వర్సెస్ ఎక్స్ పీరియో రే: ఏది బెస్ట్

By Super
|
Sony Xperia Arc Vs Sony Xperia Ray
నేనోక టెక్నాలజీ బ్లాగులో ఇటీవలే ఓ న్యూస్ చదివాను. ఆ న్యూస్ ప్రకారం ప్రపంచానికి మంచి మొబైల్స్‌(ఫెర్పామెన్స్ బాగుండేవని నా ఉద్దేశ్యం)ని పరిచయం చేసింది సోనీ ఎరిక్సన్ అని బ్లాగులో రాయడం జరిగింది. ఆతర్వాత మార్కెట్లో ఉన్న సోనీ ఎరిక్సన్ విడుదల చేసినటువంటి కొన్నిమొబైల్స్‌ని గనుక చూసినట్లైతే నాకు అతను రాసినదాన్లో నిజం ఉందనే అర్దమవుతుంది. అందులో ముఖ్యంగా సోనీ ఎరిక్సన్ విడుదల చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్‌ని గనుక చూసినట్లైతే కెమెరా క్వాలిటీ గానీ, అది అందించే ఫ్లాట్ ఫామ్స్ కానివ్వండి చాలా చక్కగా ఉంటాయి.

సోనీ ఎరిక్సన్ ఇటీవలే విడుదల చేసినటువంటి రెండు స్మార్ట్ ఫోన్స్ గురించిన సమాచారం మీకు తెలియజేస్తున్నాను. అంతే కాకుండా త్వరలో ఇండియన్ మార్కెట్లోకి కూడా మొబైల్స్‌ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రెండు మొబైల్స్ సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ఆర్క్, సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా రే. పీరియా ఆర్క్, ఎక్స్ పీరియా రే రెండు కూడా హై ఎండ్ టాప్ స్మార్ట్ ఫోన్స్. కొత్త పనితీరుతో, ఫీచర్స్‌తో మార్కెట్లోకి రావడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్‌ని గనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే పీరియా ఆర్క్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.2 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంది.

అదే ఎక్స్ పీరియా రే విషయానికి వస్తే మాత్రం 3.3 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండడం విశేషం. అంతేకాకుండా ఎక్స్ పీరియా రే మాత్రం హై డెఫినేషన్ వీడియో కంటెంట్‌లను హై రిజల్యూషన్ డిస్ ప్లే సిస్టమ్‌తో చూసిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే సోనీ ఎరిక్సన్ మొబైల్స్ కెమెరాకి పెట్టింది పేరన్న విషయం అందరికి తెలిసిందే. సరిగ్గా రెండు మొబైల్స్ కూడా 8 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండి హై డెఫినేషన్ వీడియోలను, ఇమేజిలను తీసుకోవచ్చు. వీటితో పాటు హై ఢెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 1080p ఫార్మెట్లో సపోర్ట్ చేస్తుంది.

మల్టీమీడియా ఫీచర్స్ విషయానికి వస్తే యూజర్స్‌ని ఎటువంటి నిరాశ పరచడం జరగదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫైల్స్‌ను సపోర్ట్ చేస్తాయి. రెండు మొబైల్స్‌లలో కూడా ఎఫ్ ఎమ్ రేడియో, 3.5 mm ఆడియో జాక్ మొబైల్‌తో పాటు లభిస్తాయి. రెండు మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతాయి. రెండు మొబైల్స్‌లలో కూడా మొబైల్‌తో పాటు ఇంటర్నల్ మొమొరీ లభించగా, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్పాండ్ చేసుకునే వెసులు బాటు కూడా ఉంది.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ మొదలగున్నవాటిని సపోర్ట్ చేస్తాయి. సోనీ ఎరిక్సన్ ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన విడుదల తేదిని, ఖరీదుని ఇంకా మార్కెట్లో ప్రవేశపెట్టలేదు. ఈ రెండింటికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో వన్ ఇండియా మొబైల్‌లో... టచ్ లో ఉండండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X