గెలుపు బాటలో నువ్వా నేనా ..

By Super
|
Sony Ericsson Xperia Neo
మొబైల్ మార్కెట్లో రోజురోజుకీ పెరుగుతున్న మొబైల్స్‌లలో ఏ మొబైల్ యూజర్స్ యొక్క అభిరుచులకు తగ్గట్టుగా ఉందో తెలుసుకొవడం పెద్ద కష్టం అయింది. అందుకే యూజర్స్‌కు కొంత శ్రమను తగ్గించే భాగంగా యూజర్స్‌కు ఇష్టమైన మొబైల్స్‌ యొక్క భేదాలను వివరించడం జరుగుతుంది. ఇటీవల సోనీ ఎరిక్సన్ విడుదల చేసిన సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో, హెచ్‌టిసి విగోర్ ఫోన్స్‌లలో ఏది బెస్టో తెలుసుకుందాం.

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో ఫీచర్స్‌ని గమనించినట్లేతే 4.3 ఇంచ్ స్క్రీన్ సైజుతో పాటు టచ్ స్క్రీన్‌ని కలిగి ఉండడమే కాకుండా మొబైల్ 720 X 1280 ఫిక్సల్ రిజల్యూషన్ డిస్ ప్లే దీని సోంతం. ఇందులో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే ఇది క్రింద పడినా కూడా చెక్కుచెదరదు. దీనితో పాటు సోనీ మొబైల్ బ్రేవియా ఇంజన్ అదనపు ప్రత్యేకం. ఇక హెచ్‌టిసి విగోర్ కూడా టచ్ స్క్రీన్ ఫెసిలిటీతో పాటు యాక్సలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు నిక్షిప్తం చేయబడ్డాయి. హెచ్‌టిసి విగోర్‌లో మరో ప్రత్యేకమైన ఫీచర్ HTC Sense v3.5 యూజర్ ఇంటర్ ఫేస్.

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియోలో 320 MB మొమొరీ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇందులో ఉన్న 512 MB RAM డివైజ్‌తో పాటు మొమొరీని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. మొబైల్‌తో పాటు 8జిబి మొమొరీ ఉచితంగా లభిస్తుంది. ఇక హెచ్‌టిసి విగోర్ కూడా మొమొరీని 32జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్ 2.3తో రన్ అవుతుంది. ఇందులో 1GHz Scorpion ప్రాసెసర్‌తో పాటు ఎడిరినో 250 జిపియు, క్వాలికామ్ MSM8255 స్నాప్ డ్రాగన్ సిపియు పవర్ పుల్ ప్రాసెసర్స్ నిక్షిప్తం చేయబడ్డాయి. అదే హెచ్‌టిసి విగోర్‌లో 1.5 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో రూపోందించడం జరిగింది.


ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లు అయిన HDMI port, MP4/H.264/WMV player, MP3/WMA/WAV/eAAC+లను సపోర్ట్ చేస్తాయి. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పై లను కూడా సపోర్ట్ చేస్తాయి. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో బ్యాటరీ స్టాండ్ బై టైమ్ 2జీ నెట్ వర్క్‌కి 430 గంటలు కాగా, 3జీ నెట్ వర్క్‌కి 400 గంటలు. ఆపకుండా మ్యూజిక్‌ని ఆస్వాదించినట్లైతే సుమారుగా మొబైల్ బ్యాటరీ బ్యాక్ అప్ 31 గంటల పాటు వస్తుంది. ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన ధరను మాత్రం ఇంకా మార్కెట్లో వెల్లడించలేదు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X