ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5999కే ఐపోన్ 6 ? ఫోన్ ఎక్స్చేంజ్ చేసే దమ్ము ఉంటే..
You can buy Apple iPhone 6 on Flipkart for Rs 5,999; but should you buy? Read more At Gizbot Telugu
ఆపిల్ ఐఫోన్ 8 దెబ్బకు ఆపిల్ తన పాత ఫోన్ల రేట్లపై భారీగానే కోతలు విధిస్తోంది. అయితే కొన్ని రకాల కండీషన్లతో ఈ కోతలను ప్రవేశపెడుతోంది. అలాంటి కోతనే ఇప్పుడు ఐఫోన్ 6కి ప్రవేశపెట్టింది. ఆపిల్ ప్రవేశపెట్టిన ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్లు 5,999 రూపాయలకు, 17,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చాయి.

నిజంగా ఐఫోన్ 5,999 రూపాయలేనా?
ఏంటీ.. నిజంగా ఐఫోన్ 5,999 రూపాయలేనా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును. నిజంగా ఈ ఫోన్ రూ.5,999కే అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది.

అసలు ధర 25,999 రూపాయలు
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ ఎడిషన్ అసలు ధర 25,999 రూపాయలు. అదనంగా ఈ ఫోన్‌పై 3,501 రూపాయల వరకు స్పెషల్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

ఎక్స్చేంజ్‌లో కొనుగోలుచేస్తే
అయితే ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలుచేస్తే, 20వేల రూపాయల వరకు తగ్గింపు లభించి, రూ.5999కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లభించనుందట.

ఐఫోన్ 7 ప్లస్ లాంటి ఏదైనా హై-ఎండ్ ఫోన్‌ను
అది కూడా ఐఫోన్ 7 ప్లస్ లాంటి ఏదైనా హై-ఎండ్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి దీన్ని కొనుగోలుచేస్తేనే, ఈ స్మార్ట్‌ఫోన్ రూ.5,999కు లభ్యంకానుంది.

ప్రశ్నార్థకం
కానీ ఐఫోన్ 7 ప్లస్ లాంటి స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 6ను ఎవరు కొనుగోలుచేస్తారు? ఇదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది.

చాలా హాస్యాస్పదంగా
ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ చాలా హాస్యాస్పదంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పలువురంటున్నారు. ఐఫోన్ 6ఎస్ విషయంలో తీసుకున్న కూడా ఇదే విధమైన ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్
ఈ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ అసలు రూ.37,999కు లిస్టు అయింది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీన్ని రూ.17,999కు విక్రయిస్తోంది. ప్రీమియం, ఖరీదైన ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి, దీన్ని కొనుక్కుంటే, ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications