ఈ ఫోన్‌ను సబ్బుతో కూడా వాష్ చేసుకోవచ్చు

ఇప్పటి వరకు మనం ప్రమాదాలను తట్టుకోగలిగే రగ్గుడ్ ప్రూఫ్,వాటర్ ప్రూఫ్, షాక్ ఫ్రూఫ్ ఫోన్‌లను చూసాం. తాజాగా వీటన్నింటిని మించుతూ సరికొత్త స్టాండర్డ్ డ్యూరబులిటీ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ' రాఫ్రీ' పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌ను Kyocera అభివృద్థి చేస్తోంది.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

MIL-STD-810G, IPX5, IPX8 and IP5X రేటింగ్స్

ఈ ఫోన్‌ను సబ్బు నీటిలో వాష్ చేసుకోవచ్చు. MIL-STD-810G, IPX5, IPX8 and IP5X రేటింగ్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ అన్ని రకాల ప్రమాదాలను తట్టుకోగలదు.

డిగ్నో రాఫ్రీ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌

డిసెంబర్, 2015లో లాంచ్ అయిన 'డిగ్నో రాఫ్రీ'(Digno Rafre) ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ఈ ఫోన్ రాబోతోంది.

డ్రాగన్ ట్రెయిల్ ఎక్స్‌క్లాస్ కోటింగ్‌

మరింత క్లీనింగ్ నిమిత్తం ఈ ఫోన్‌ను వేడి నీటిలోనూ ఉంచొచ్చట. ఈ ఫోన్ స్వతహాగా హీల్ చేసుకోగలిగే రేర్ ప్యానల్‌ను కూడా కలిగి ఉంటుందట. డ్రాగన్ ట్రెయిల్ ఎక్స్‌క్లాస్ కోటింగ్‌తో వస్తోన్న ఈ ఫోన్ డిస్‌ప్లేను తడిచేతులతోనూ ఆపరేట్ చేయవచ్చు.

పేల్ పింక్, క్లియర్ వైట్, లైట్ బ్లూ

పేల్ పింక్, క్లియర్ వైట్, లైట్ బ్లూ కలర్ వేరియంట్‌లలో రాబోతోన్న ఈ ఫోన్ మార్చి 2017 నుంచి నుంచి జపాన్ మార్కెట్లో లభ్యమవుతుందట.ధర వివరాలు వెల్లడికావల్సి్ ఉంది.

రాఫ్రీ ఫోన్ స్పెసిఫికేషన్స్

5 అంగుళాల HD డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్1280x 720పిక్సల్స్),3,000mAh బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,

Kyocera రాఫ్రీ ఫోన్ వీడియో

Kyocera రాఫ్రీ ఫోన్ వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
You can literally wash this Smartphone with soap. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot