రూ. 501కే జియో ఫోన్, ప్రారంభం అయిన బుకింగ్, ఎలాగో తెలుసుకోండి

|

రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ ఇటీవలే తన 41వ వార్షిక సాధారణ సమావేశాన్ని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. జియో గిగాఫైబర్‌ లాంచింగ్‌, జియో ఫోన్‌ హై ఎండ్‌ మోడల్‌ జియో ఫోన్‌2 విడుదల, జియోఫోన్‌లో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ యాప్‌లు అందుబాటు వంటి వాటిని ఆఫర్‌ చేస్తున్నట్టు కంపెనీ ఈ సమావేశంలో ప్రకటించింది. వీటిలో జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీని బుకింగ్ వివరాలు ప్రారంభం అయ్యాయి.

 

అమెజాన్ సేల్ మిస్సయ్యారా,రూ.15 వేలలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లుఅమెజాన్ సేల్ మిస్సయ్యారా,రూ.15 వేలలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

కేవలం 501 రూపాయలకే

కేవలం 501 రూపాయలకే

అత్యంత తక్కువ ధరకు ఎవరైతే జియోఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికే ఈ జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌. పాత ఫీచర్‌ ఫోన్‌ ఎక్స్చేంజ్‌ చేసి కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే పొందవచ్చు.

జూలై 21 నుంచి..

జూలై 21 నుంచి..

జూలై 21 నుంచి జియో మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ అందుబాటులోకి వస్తున్న ఈ నేపథ్యంలో కంపెనీ ఈ ఆఫర్‌ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ‘రిజిస్టర్‌ యువర్‌ ఇంటరెస్ట్‌' గా జియో ఈ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది.

 జియో.కామ్‌ ..

జియో.కామ్‌ ..

ఈ ఆఫర్‌ను రిజిస్ట్రర్‌ చేయాలనుకునే వారు, జియో.కామ్‌ లేదా మైజియో యాప్‌లోకి లాగిన్‌ అయి, ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

వ్యాపారం లేదా వ్యక్తిగతం
 

వ్యాపారం లేదా వ్యక్తిగతం

దానిలో అడిగిన వివరాలను నమోదు చేసిన అనంతరం, నియమ, నిబంధనలను అంగీకరించి, వ్యాపారం లేదా వ్యక్తిగతం అనే దాన్ని క్లిక్‌ చేయాలి. ఆ అనంతరం సబ్‌మిట్‌ బటన్‌ నొక్కాలి.

ఈ-మెయిల్‌కు లేదా ఎస్‌ఎంఎస్‌ ..

ఈ-మెయిల్‌కు లేదా ఎస్‌ఎంఎస్‌ ..

ఈ ప్రక్రియ అనంతరం జియో మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను రిజిస్టర్‌ చేసుకున్నట్టు మీ ఈ-మెయిల్‌కు లేదా ఎస్‌ఎంఎస్‌ రూపంలో మెసేజ్‌ వస్తుంది.

 సిమ్‌ కార్డులను లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇదే ప్రక్రియ

సిమ్‌ కార్డులను లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇదే ప్రక్రియ

జియో తొలుత మార్కెట్‌లో సిమ్‌ కార్డులను లాంచ్‌ చేసినప్పటి నుంచి ఇదే ప్రక్రియను అనుసరిస్తోంది. ఎవరైతే ముందస్తు బుకింగ్‌ లేదా రిజిస్టర్‌ చేసుకుంటారో వారికి ఇతరుల కంటే ముందుగా ప్రాధాన్యత ఇస్తారు.

జియోఫోన్‌ కు కూడా ఇదే ప్రక్రియ

జియోఫోన్‌ కు కూడా ఇదే ప్రక్రియ

జియోఫోన్‌ కు కూడా ఇదే ప్రక్రియను రిలయన్స్‌ అనుసరించింది. అయితే తాజాగా చేపడుతున్న రిజిస్ట్రేషన్లు కస్టమర్లను క్యూలైన్ల నుంచి కాపాడలేవని తెలుస్తోంది.

ఆఫర్‌ అందుబాటులోకి రావడానికి ముందే ..

ఆఫర్‌ అందుబాటులోకి రావడానికి ముందే ..

ఇది, కేవలం ఆఫర్‌ అందుబాటులోకి రావడానికి ముందే ఎన్ని డివైజ్‌లు అందుబాటులో ఉంటున్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిసింది.

ఆఫర్‌ లైవ్‌లోకి వచ్చే సమయంలో

ఆఫర్‌ లైవ్‌లోకి వచ్చే సమయంలో

ఈ రిజిస్ట్రేషన్‌తో ఆఫర్‌ లైవ్‌లోకి వచ్చే సమయంలో యూజర్లకు నోటిఫికేషన్‌ అలర్ట్‌ను కంపెనీ పంపిస్తుందని, దీంతో స్టోర్‌ వద్దకు వెళ్లి త్వరగా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుందని తెలిసింది.

ఆధార్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను

ఆధార్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను

ఆధార్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను జియో స్టోర్‌కు తీసుకెళ్తే, మాన్‌సూన్‌ ఆఫర్‌లో జియోఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
JioPhone Monsoon Hungama offer registration opens, but no preference to those who queue up More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X