Home
Mobile

నేటి నుంచే iPhone 7 బుకింగ్స్, Flipkartలో మాత్రమే

By Sivanjaneyulu Bommu

యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ బుకింగ్స్ నేటి నుంచి Flipkartలో ప్రారంభంకాబోతున్నాయి. ఆర్డర్ చేసుకున్న వారికి అక్టోబర్ 7 నుంచి డెలివరీ ప్రక్రియ మొదలవుతుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

నేటి నుంచే iPhone 7 బుకింగ్స్, Flipkartలో మాత్రమే

Read More : YouTube Go..ఈ యాప్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు

సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ ఇంకా న్యూ బ్లాక్ ఫినిష్ (జెట్ బ్లాక్ వేరియంట్‌లలో) కొత్త ఐఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.32జీబి, 128జీబి, 256జీబి మోడల్స్ లో లభ్యమయ్యే ఈ ఫోన్ ల ప్రారంభ ధర రూ.60,000గా నిర్ణయించారు.

మునుపటి ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే..

మునుపటి ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే..

మునుపటి ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే, 25శాతం ప్రకాశవంతమైన డిస్‌ప్లే వ్యవస్థతో వస్తోన్న కొత్త ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో వైడ్ కలర్ gamut, 3డీ టచ్ మేనేజ్ మెంట్, 3డీ టచ్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

ఐఫోన్ 7 డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

ఐఫోన్ 7 డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

యాపిల్ ఐఫోన్ 7 డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి, ఈ హ్యాండ్‌సెట్‌‌లో 4.7 అంగుళాల Retina HD డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. మరో వైపు ఐఫోన్ 7 ప్లస్‌, 5.5 అంగుళాల Retina HD డిస్‌ప్లేతో కనువిందు చేస్తుంది.

శక్తివంతమైన A10 Fusion ప్రాసెసర్‌

శక్తివంతమైన A10 Fusion ప్రాసెసర్‌

ఈ రెండు ఫోన్‌లు శక్తివంతమైన A10 Fusion ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ఈ 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ గతేడాది యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చిన A9 ప్రాసెసర్‌తో పోలిస్తే 40 శాతం వేగంగా స్పందించగలదు.
యాపిల్ సరికొత్త iOS 10 ఆపరేటింగ్ సిస్టం పై ఈ రెండు ఐఫోన్‌లు రన్ అవుతాయి.

ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి

ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి

ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ బేస్ మోడల్స్ 32జీబి వేరియంట్ నుంచి ప్రారంభమవుతాయి. 128జీబి, 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంటాయి.

హోమ్‌బటన్ వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్

హోమ్‌బటన్ వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్

యాపిల్ తన కొత్త ఐఫోన్‌లలో హోమ్‌బటన్ వ్యవస్థను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. యూజర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సరికొత్త టాప్టిక్ ఇంజిన్‌తో పని చేసే ఈ హోమ్‌బటన్ ఇప్పుడు మరింత ఫోర్స్ సెన్సిటవ్ గా అనిపిస్తుంది.

ఐపీ67 ప్రొటెక్షన్

ఐపీ67 ప్రొటెక్షన్

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో ఐపీ67 ప్రొటెక్షన్ స్టాండర్డ్‌తో కూడని వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సామర్థ్యాలను పొందుపరిచారు. ఇవి నీటిలో పడినప్పటికి ఎటువంటి ప్రమాదాలకు గురికావు.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి

ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో విప్లవాత్మక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు six element లెన్స్‌ను యాపిల్ నిక్షిప్తం చేసింది.

TrueTone Flash ఫ్లాష్‌..

TrueTone Flash ఫ్లాష్‌..

TrueTone Flash ఫ్లాష్‌తో కూడిన 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను ఐఫోన్ 7 కలిగి ఉంటుంది. కెమెరాలో పొందుపరిచిన f/1.8 aperture మరింత బ్రైట్నెస్‌ను అందిస్తుంది. ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగా పిక్సల్. లైవ్ ఫోటోలను కూడా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఐఫోన్ 7 ప్లస్ రెండు 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాలతో ..

ఐఫోన్ 7 ప్లస్ రెండు 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాలతో ..

మరోవైపు ఐఫోన్ 7 ప్లస్ రెండు 12 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాలతో వస్తోంది. ఈ డ్యుయల్ కెమెరా సెటప్‌లో భాగంగా మొదటి కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటే, మరొక కెమెరా telephoto ఫీచర్ ను కలిగి ఉంటుంది. డీఎస్ఎలఆర్ తరహా డెప్త్ ఫోటోగ్రఫీని ఐఫోన్ 7 ప్లస్ అందించగలదు. ఫోన్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగా పిక్సల్.

ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్ వ్యవస్థ

ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్ వ్యవస్థ

యాపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్ ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్ వ్యవస్థతో వస్తున్నాయి. ఫోన్ టాప్ అలానే బోటమ్ భాగాల్లో ఏర్పాటు చేసిన స్పీకర్లు ఫోన్ వాల్యుమ్ స్థాయిని మరింత హై డైనమిక్ రేంజ్ లో అందిస్తాయి. 

ఆడియా జాక్‌కు బదులుగా

ఆడియా జాక్‌కు బదులుగా

యాపిల్ తన కొత్త ఫోన్‌లలో 3.5ఎమ్ఎమ్ ఆడియా జాక్‌కు బదులుగా లైట్నింగ్ పోర్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

AirPods..

AirPods..

వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పై దృష్టిసారించిన యాపిల్ తమ ఐఫోన్ 7 మోడల్స్ కోసం AirPods పేరుతో విప్లవాత్మక వైర్ లెస్ ఇయర్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్ డిజైన్ చేసిన W1 చిప్ ఆధారంగా పనిచేసే ఈ ఇయర్‌ఫోన్‌ల సరికొత్త వైర్‌లెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తాయి.

బ్యాటరీ విషయానికి వచ్చే సరికి..

బ్యాటరీ విషయానికి వచ్చే సరికి..

బ్యాటరీ విషయానికి వచ్చే సరికి ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లలో శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను యాపిల్ నిక్షిప్తం చేసింది. ఐఫోన్ 6ఎస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 బ్యాటరీ 40 శాతం మెరుగుపరచబడి పనితీరును కనబర్చగలదట. మరోవైపు ఐఫోన్ 6ఎస్‌ ప్లస్‌తో పోలిస్తే ఐఫోన్ 7 ప్లస్‌ బ్యాటరీ అదనంగా 60 నిమిషాల బ్యాటరీ లైఫ్‌ను పెంచగలదట.

అక్టోబర్ 7 నుంచి ఇండియన్ మార్కెట్లో...

అక్టోబర్ 7 నుంచి ఇండియన్ మార్కెట్లో...

Apple ఇండియా వెబ్‌సైట్ రివీల్ చేసిన వివరాల ప్రకారం ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ మోడల్స్ అక్టోబర్ 7 నుంచి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రారంభ ధర రూ.60,000గా ఉంటుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ మోడల్స్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

ప్రతి బండిల్ ప్యాక్‌లోనూ...

ప్రతి బండిల్ ప్యాక్‌లోనూ...

ప్రతి బండిల్ ప్యాక్‌లోనూ లైట్నింగ్ కనెక్టర్‌తో కూడిన EarPodతో పాటు 3.5ఎమ్ఎమ్ Headphone Jack Adapterను అందిస్తారు. వీటికి విడిగా ఛార్జ్ ఉంటుంది. లైట్నింగ్ కనెక్టర్ ధర రూ.2,500 కాగా, హెడ్‌ఫోన్ జాక్ అడాప్టర్ ధర రూ.900గా ఉంటుంది. యాపిల్ అందిస్తోన్న సరికొత్త వైర్‌లెస్ AirPods ధర రూ.15,400గా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
You Can Pre-book Apple iPhone 7, 7 Plus from Flipkart. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X