స్మార్ట్‌ఫోన్‌లు @2018

Posted By:

సరిగ్గా అరచేతిలో ఇమిడి పోతున్న స్మార్ట్‌ఫోన్ నేటి ఉరకుల పరుగుల జీవితాలను స్మార్ట్ చేసేస్తోంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ విభాగంలో ప్రపంచ రూపురేఖలనే మార్చేసిన స్మార్ట్‌ఫోన్ మరింత ఆధునీకత వైపు అడుగులు వేస్తోంది. చాటింగ్ మొదలుకుని షాపింగ్, బ్యాకింగ్, గేమింగ్, ఇంటర్నెట్, సినిమా ఇలా అనేకమైన అవసరాలను నేటి కాలపు స్మార్ట్‌ఫోన్‌లు తీర్చేస్తున్నాయి.

ప్రజలకు మరిన్ని ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను అందించే క్రమంలో యాపిల్, సామ్‌సంగ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు కృషిచేస్తున్నాయి. 2018 నాటికి స్మార్ట్‌ఫోన్ స్వభావం ఏలా ఉండబోతోంది..?, ఏ విధమైన కొత్త ఫీచర్లు మనం చూడబోతున్నాం..? వంటి ప్రశ్నలకు టెక్ పండితులు తెలిపిన పలు ముఖ్యమైన సమాధానాలను ఇప్పుడు చూద్దాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌లు @2018

అందుబాటులోకి ట్రై కార్డర్ స్మార్ట్‌ఫోన్‌లు (Tricorder Smartphones)

ఈ తరహా సెన్సార్ వ్యవస్థలతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వినియోగదారలు వైద్యుల సహాయం లేకుండా సెన్సార్ల సాయంతో హృదయ స్పందన రేటు, రక్త పోటు, వ్యాయమం, కేలరీల ఖర్చు, ఉష్ణోగ్రత వంటి వివరాలను తెలుసుకోవచ్చు.

 

స్మార్ట్‌ఫోన్‌లు @2018

మీ కళ్లే పాస్‌వర్డ్‌లు కావచ్చు (Your Eyes Are Your Password):

2018నాటికి మనం చూడబోయే స్మార్ట్‌ఫోన్‌లలో ఐస్కానింగ్ పాస్‌వర్డ్ ఫీచర్‌ను మనం చూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ తరహా టెక్నాలజీ పై సామ్‌సంగ్ దృష్టిసారించినట్లు సమాచారం.

 

స్మార్ట్‌ఫోన్‌లు @2018

32 కోర్ ప్రాసెసర్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు (32-Core Processors)

శక్తివంతమైన డెస్క్‌టాప్ కంప్యూటర్‌లలో ఉపయోగించే 32 కోర్ ప్రాసెసర్‌లను భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేసే అవకాశముందని తద్వారా మరింత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని పొందవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

 

స్మార్ట్‌ఫోన్‌లు @2018

కంప్యూటేషనల్ కెమెరాలు (Computational Cameras):

వచ్చే ఐదేళ్ల కాలంలో కంప్యూటేషనల్ కెమెరా టెక్నాలజీని స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేసే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఈ తరహా టెక్నాలజీని అనుసంధనాం చేయటం ద్వారా మనిషి కంటిచూపు తరహాలో కెమెరా పరిస్థితులకు తగ్గట్లు స్పందిస్తాయి.

 

స్మార్ట్‌ఫోన్‌లు @2018

వాయిస్ కంట్రోల్ (Voice Control)

ఇప్పటికే వాయిస్ కంట్రోల్ పై స్సందించే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేసాయి. 2018 నాటికి ఈ టెక్నాలజీ మరింత విప్లవాత్మకం కానుంది.

 

స్మార్ట్‌ఫోన్‌లు @2018

ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్‌లు (Screens That Bend)

వొంపు తిరిగిన స్ర్కీన్‌లతో కూడిన స్మార్ట్‌‍ఫోన్ లను ఇప్పటికే సామ్‌సంగ్, ఎల్‌జి వంటి కంపెనీలు విడుదల చేసాయి. భవిష్యత్‌లో ఈ తరహా ఫ్లెక్సిబుల్ స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లను  భవిష్యత్‌లో మరింత విప్లవాత్మకం కానున్నాయి.

 

స్మార్ట్‌ఫోన్‌లు @2018

శక్తివంతమైన బ్యాటరీ లైఫ్ (True All-Day Battery Life)

భవిష్యత్‌లో మనం చూడబోయే స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థ అంటే సింగిల్ చార్జ్‌తో రోజంతా మాట్లాడగలిగే బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot