కొత్త పోన్‌కు నెల దాటితే సగం ధరే!

|

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే, మీకో షాకింగ్ న్యూస్!. మీ కొత్త ఫోన్ విలువ నెల దాటితే సగానికి పడిపోయినట్లేనని, ఓ ప్రముఖ రిసెర్చ్ సర్వే వెల్లడించింది. సంవత్సరం వాడిన కారు విలువ 20 శాతానికి పడిపోతుండగా, స్మార్ట్‌ఫోన్ విలువ మాత్రం నెల రోజులకే 65 శాతానికి పడిపోతున్నట్లు musicMagpie.co.uk నివేదిక చెబుతోంది. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు బహిర్గతమవటం విశేషం. ఐఫోన్‌లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్‌ల విలువ మరింత తగ్గిపోతున్నట్లు ఈ సర్వే చెప్పుకొచ్చింది.

కొత్త పోన్‌కు నెల దాటితే సగం ధరే!

ఐఫోన్ 4 మార్కెట్లో విడుదలై 5 సంవత్సరాలు కావొస్తున్నప్పటికి, ఈ డివైస్ మార్కెట్ విలువ 39శాతంగా ఉందట. ఐఫోన్ 6 మార్కెట్లో విడుదలైన సంవత్సరం తరువాత, ఆ ఫోన్ మార్కెట్ వాల్యూ 50 శాతంగా ఉందట. ఐఫోన్ 5 మార్కెట్లో విడుదలైన 8 నెలలకే 66శాతం మార్కెట్ వాల్యూను కోల్పొయిందట. 2014లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మార్కెట్ విలువ రెండు నెలలకే సగానికి పడిపోయిందట. 2015లో విడుదలైన హెచ్‌టీసీ వన్ ఎం9 విలువ నెలరోజులకే 65 శాతానికి పడిపోయిందట.

Read More : ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ 17 రకాలట, వారెవరో తెలుసుకుందామా!

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

 స్మార్ట్‌ఫోన్ లేక ఫీచర్ ఫోన్ ఈ ప్రశ్నకు సమధానం చాలా ఈజీగా దొరికేస్తుంది. ఎందుకంటే..?, సౌకర్యాల దృష్ట్యా ఈ రోజుల్లో ఎవరైనా సరే స్మార్ట్‌ఫోన్‌నే కోరుకుంటారు. వందలు కొద్ది ఫీచర్లు, బెటర్ ఇంటర్నెట్ కనెక్టువిటీ, కెమెరా, పెద్దదైన డిస్‌ప్లే, స్టోరేజ్ మెమరీ వంటి ప్రత్యేకతలు స్మార్ట్‌ఫోన్ సొంతం. ఫీచర్ ఫోన్‌లలో కాల్స్ రిసీవ్ చేసుకుంటం తప్ప ఏముంటుంది చెప్పిండి. కాబట్టి, మీ ప్రిఫరెన్స్ స్మార్ట్‌ఫోన్‌కే ఇవ్వటం బెటర్.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

మీరు ఎంపిక చేసుకునే ఫోన్ డిజైన్ ముందు చూడటానికి కంఫర్ట్ గా ఉండాలి. పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అదే సమయంలో మన్నిక కూడా ఎంతో అవసరం. ముఖ్యంగా అవుట్ డోర్ వాతావరణాలను మీ ఫోన్ తట్టుకునేంత సామర్థ్యాలను కలిగి ఉండాలి. వాటర్ రెసిస్టెంట్ కూడా అవసరం.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ఆండ్రాయిడ్ మొదటి స్థానంలో ఉంటే యాపిల్ ఐఓఎస్ రెండవ స్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్ ఫోన్ లు యూజర్ ఫ్రెండ్లీ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో సులువైన స్మార్ట్ మొబైలింగ్‌ను మీకు చేరువచేస్తాయి. మరోవైపు యాపిల్ ఐఓఎస్ పై స్పందించే ఐఫోన్‌లు ప్రొఫెషనల్ క్వాలిటీ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఆకట్టుకుంటాయి. అయితే యాపిల్ ఐఫోన్‌లు కాస్తంత ఖరీదెక్కువ. ఇవే కాకుండా మార్కెట్లో బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో వేటి ప్రత్యేకత వాటికే ఉంది. కాబట్టి ఆపరేటింగ్ సిస్టం ఎంపిక విషయంలో తుది నిర్ణయం మీదే.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్‌‌ను చేరువ చేస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఫోన్‌లలో టెక్స్టింగ్ కొంచం ఇబ్బందిగా ఉంటుంది. మీరు టెక్స్టింగ్ కోసమే స్మార్ట్‌ఫోన్‌ను కొంటున్నట్లయితే మీ కోసం క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరా ఫోటోగ్రఫీకి ధీటుగా స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీ అభివృద్థి చెందుతోంది. మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్ ఉత్తమ క్వాలిటీ ఫోటోలను ఉత్పత్తి చేయాలంటే 5 అంతకన్నా ఎక్కువ మెగా పిక్సల్ సామర్థ్యాన్ని మీ ఫోన్ కలిగి ఉండాలి.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ప్రధానంగా వేధిస్తోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. మీ స్మార్ట్‌‌ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయంటే బ్యాటరీ బ్యాకప్ అంత త్వరగా తగ్గిపోతుందని అర్థం. కాబట్టి సింగిల్ చార్జ్ పై ఒకటి రెండు రోజులు బ్యాకప్‌నిచ్చే స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవటం మంచిది. క్విక్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటే బాగుంటుంది.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

భారత్‌లో ప్రస్తుతానికి 2జీ, 3జీ, 4జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మీ ఫోన్ 4జీ ఇంటర్నెట్ కనెక్టువిటీని సపోర్ట్ చేసేదిగా ఉంటే బాగుంటుంది.

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

కొత్త ఫోన్ కొనే ముందు ఈ విషయాల్లో క్లారిటీ అవసరం

మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఫిట్నెస్ ట్రాకర్ వంటి అదనపు ఫీచర్లుంటే బాగుంటుంది.

Best Mobiles in India

English summary
Your smartphone loses half of its value in a month!. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X