Home
Mobile

ఐఫోన్ ఎక్స్‌‌లో అదొక్కటే మైనస్!

By Bommu Sivanjaneyulu

ఐపోన్ 10వ వార్షికోత్సవాన్ని ఆపిల్ సంస్థ లాంచ్ చేసిన స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. బీజిల్-లెస్ డిజైన్‌తో వచ్చిన మొట్టమొదటి ఐఫోన్ ఇదే కావటంతో ప్రతిఒక్కరు ఈ డివైస్ పై ఆసక్తి చూపుతున్నారు.

YouTube now supports full screen videos for iPhone X

ఫుల్ విజన్ డిస్‌ప్లే అనేది మార్కెట్‌కు కొత్తేమి కాదు, సామ్‌సంగ్, షావోమి, మైక్రోమాక్స్, వివో, హానర్, జియోనీ, ఎల్‌జీ వంటి బ్రాండ్‌లు ఇప్పటికే బీజిల్-లెస్ డిజైన్ ఫోన్‌ను మార్కెట్లో అందిస్తున్నాయి. మరొక కోణంలో విశ్లేషించినట్లయితే ఐఫోన్ ఎక్స్ ఫోన్‌లో పెద్దగా చెప్పుకోదగిన సంచలన ఫీచర్లు కూడా ఏమి లేవు!

హోమ్ బటన్ సదుపాయం లేదు..

హోమ్ బటన్ సదుపాయం లేదు..

ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో హోమ్ బటన్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి సదుపాయాలు లేవు. బీజిల్ లెస్ డిజైన్ వల్ల ఫోన్ డిస్‌ప్లే అందంగా కనిపించినప్పటికి స్ర్కీన్ పై భాగంలో ఏర్పాటు చేసిన అన్‌వాంటెడ్ బ్లాక్‌బార్.. వీడియోలను వీక్షిస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతోన్న సమయంలో అసౌకర్యానికి గురి చేస్తోంది. ఈ బ్లాక్‌బార్ ఎపెక్ట్‌ను మినిమైజ్ చేసేందుకు యాప్ డెవలపర్స్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందుకు అనువుగా అప్‌డేట్ చేయవల్సి ఉంది.

ఫుల్ స్ర్కీన్ పై యూట్యూబ్ వీడియోలు

ఫుల్ స్ర్కీన్ పై యూట్యూబ్ వీడియోలు

ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలను ఫుల్-స్ర్కీన్ మోడ్‌లో స్ట్రీమ్ చేసుకునేందుకుగాను యూట్యూబ్ సరికొత్త అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. ఈ అప్‌డేట్‌తో 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తోన్న ఐఫోన్ స్ర్కీన్‌ పై ఫుల్ స్కీన్ మోడ్‌తో వీడియోలను వీక్షించే వీలుంటుంది. ఐఫోన్ ఎక్స్ యూజర్లు iOS యాప్ స్టోర్‌లోకి వెళ్లి యూట్యూబ్ వెర్షన్ 12.43కి అప్‌గ్రేడ్ అవటం ద్వారా ఈ ఫుల్ స్ర్కీన్ మోడ్ వారికి అందుబాటులో ఉంటుంది.

అన్‌వాంటెడ్ బ్లాక్‌బార్..

అన్‌వాంటెడ్ బ్లాక్‌బార్..

యూట్యూబ్ వీడియోలను వీక్షించే సమయంలో ఫుల్-స్ర్కీన్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే వీడియో పై డబల్ టాప్ ఇస్తే చాలు. ఐఫోన్ ఎక్స్ స్ర్కీన్‌ పై ఫుల్ స్కీన్ మోడ్‌తో వీడియోలను వీక్షిస్తున్నప్పుడు అన్‌వాంటెడ్ బ్లాక్‌బార్ కాస్తంత అసౌకర్యానికి గురి చేస్తోంది. డిస్‌ప్లే పై భాగంలో చిన్న కట్‌అవుట్ రూపంలో దర్శనమిస్తోన్న బ్లాక్‌బార్‌లో ఫోన్‌కు సంబంధించిన సెన్సార్‌లతో పాటు ట్రూ డెప్త్ కెమెరాను యాపిల్ నిక్షిప్తం చేసింది.

 ఫేస్ఐడీతో యూజర్ ముఖమే పాస్‌వర్డ్

ఫేస్ఐడీతో యూజర్ ముఖమే పాస్‌వర్డ్

ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని 5.8 అంగుళాల ఎడ్జ్-ట-ఎడ్జ్ ఓఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే క్రిస్ప్ క్వాలిటీతో వీడియోలను ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్‌లో టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన ఫేస్ఐడీ ఫీచర్‌ను యాపిల్ పొందుపరిచింది. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్‌లాక్ చేసే వీలుంటుంది. ఈ FaceID ఫీచర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో ట్రుడెప్త్ కెమెరాను యాపిల్ వినియోగించింది.

ఖరీదైన ఐఫోన్ ఇదే..

వైర్‌‍లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసేందుకుగాను ఐఫోన్ ఎక్స్ గ్లాస్ బాడీని కలిగి ఉంది. ఇప్పటి వరకు మార్కెట్లో అన్ని ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ ఎక్స్ ఖరీదైన ఫోన్‌గా నిలిచింది.మార్కెట్లో ఐఫోన్ ఎక్స్ (256జీబి స్టోరేజ్) వర్షన్‌ను రూ.1,02,000కు, బేసిక్ వర్షన్‌ను రూ.89,000కు విక్రయించటం జరుగుతోంది.

యాపిల్ ఐఫోన్ ఎక్స్ స్పెసిఫికేషన్స్...

5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
YouTube now supports full screen videos for iPhone X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X