ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫోన్, ధర రూ. 2,500 మాత్రమే !

Written By:

మాములుగా స్మార్ట్ ఫోన్లు అరచేతిలో ఇమిడిపోని విధంగా చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే మీ క్రెడిట్, డెబిట్ కార్డ్ కన్నా తక్కువ సైజులో ఉండే ఫోన్లను ఎప్పుడైనా చూశారా...ఇప్పుడు మార్కెట్లో బొటన వేలంత పొడవులో, కాయిన్ కన్నా తక్కువలో ఓ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. జాంకో టైనీ టీ1 పేరుతో ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఫోన్ పూర్తి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

వివో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్, వరుసగా 3 రోజులు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జాంకో టైనీ టీవ‌న్‌

లండ‌న్‌కి చెందిన క్లూబిట్ న్యూ మీడియా కంపెనీ ప్ర‌పంచంలో అతిచిన్న మొబైల్‌ఫోన్‌ను త‌యారుచేసింది. దీనికి 'జాంకో టైనీ టీవ‌న్‌' అని పేరు పెట్టారు. క్రెడిట్ కార్డు కంటే చాలా చిన్న‌గా ఉన్న ఈ ఫోన్‌ను ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా విడుద‌ల చేశారు.
Image source : hindustantimes

బరువు ఒక కాయిన్ కన్నా తక్కువే

ఈ ఫోన్ ఎంత చిన్నగా ఉంటుందంటే.. కేవలం ఒక బొటన వేలు పొడవులో మాత్రమే ఉంటుంది. ఇక బరువు ఒక కాయిన్ కన్నా తక్కువే ఉంటుంది. ఈ ఫోన్ కొలతలు 46.7 x 21 x 12 mm గా ఉండగా, బరువు 13 గ్రాములు మాత్రమే.
Image source : Bgr

జాంకో టైనీ టీ1 ఫీచర్లు

సింగిల్ నానో సిమ్
300 కాంటాక్ట్స్ స్టోరేజి, 50 ఎస్‌ఎంఎస్‌లు స్టోర్
50 ఇన్‌కమింగ్/ఔట్ గోయింగ్ కాల్స్ స్టోర్
32 ఎంబీ ర్యామ్‌, 32 ఎంబీ స్టోరేజ్‌
మీడియాటెక్ ఎంటీకే6261డి మదర్‌బోర్డు
0.49 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 32 x 64 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
200 ఎంఏహెచ్ బ్యాటరీ
2జీ సపోర్ట్
బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ, లౌడ్ స్పీకర్ ఫీచర్లు
నో ఇంటర్నెట్ యాక్సెస్

ధర రూ. 2,500

ఈ ఫోన్ వచ్చే ఏడాది మేలో మార్కెట్‌లో లభ్యం కానుంది. కాగా దీని ధరను కంపెనీ రూ. 2,500గా నిర్ణయించింది. ఇంటర్నెట్ తో పని లేకుండా కేవలం కాల్స్ మాట్లాడేవారు ఈ ఫోన్ పై ఆసక్తి చూపవచ్చు.

నానోఫోన్ సీ

కాగా ఇప్పటికే ఢిల్లీకి చెందిన ఈ-కామ‌ర్స్ సంస్థ యెర్హా డామ్ కామ్ వారు గ‌త నెల 'నానోఫోన్ సీ' పేరుతో అతిచిన్న మొబైల్ ఫోన్ ను దేశీయంగా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

దీని ధ‌ర రూ. 2999

దీన్ని ప్ర‌పంచంలోనే అతిచిన్న జీఎస్ఎమ్ మొబైల్‌గా కంపెనీ పేర్కొంది. దీని ధ‌ర రూ. 2999. ఇప్పుడు దీనికన్నా తక్కువ సైజులో జాంకో టైనీ టీ1 ఫోన్ మార్కెట్లో సందడి చేయనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meet Zanco tiny t1, the worlds smallest phone even smaller than your credit card More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot