డ్యూయల్ సిమ్ ఫీచర్‌లో గొప్ప నువ్వా నేనా..

By Super
|
Spice vs Zen
ఇండియన్ మొబైల్ మార్కెట్లో కొత్తగా రెండు డ్యూయల్ సిమ్ ఫోన్స్‌ త్వరలో విడుదలవనున్నాయి. రెండు మొబైల్స్ కూడా ఇండియన్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని రూపోందించడం జరిగింది. రెండు మొబైల్స్ కూడా దేశీయ మొబైల్ దిగ్గజాలు కావడం విశేషం. ఒకటి జెన్ మొబైల్స్ జెన్ ఏ 60 కాగా, రెండవది స్పైస్ మొబైల్స్‌కి చెందిన స్పైస్ క్యూటి 53.

జెన్ ఏ 60 చూడడానికి చక్కగా ఉండి డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని కలిగి ఉంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందింజే భాగంలో 2.4 ఇంచ్ కలర్ డిస్ ప్లేని కలిగి ఉంది. అదే స్పైస్ క్యూటి 53 విషయానికి వస్తే క్వర్టీ కీప్యాడ్‌ని కలిగి ఉండి 2 ఇంచ్ టిఎఫ్‌టి డిస్ ప్లే దీని సొంతం. స్పైస్ క్యూటి 53 ఫోన్ 0.3 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఎఫ్ ఎమ్ రేడియో మాత్రమే కాకుండా రికార్డింగ్ ఫెసిలిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

ఇక జెన్ ఏ 60 మాత్రం 3జీ నెట్ వర్క్‌ని సపోర్ట్ చేస్తూ ఎఫ్ ఎమ్ రేడియో ఫీచర్‌ని కలిగి ఉంది. మొబైల్ వెనుక భాగాన 3.2 మెగా ఫిక్సల్ కెమెరా వస్తుండగా అదే, మొబైల్ ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తుంది. మొమొరీతో పాటు 78ఎమ్‌బి మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 16జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఇక రెండు మొబైల్స్‌లలో కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ గనుక చూస్తే బ్లూటూత్, జిపిఆర్‌ఎస్ లను సపోర్ట్ చేస్తాయి. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్, జిటాక్, స్కైపీ అప్లికేషన్స్‌ని ఈజీగా యాక్సెస్ చేసే అవకాశం కల్పించడం జరిగింది.


స్పైస్ క్యూటి 53 మొబైల్‌లో 800 mAH Li- ion బ్యాటరీని కలిగి ఉంది. దీని వల్ల మొబైల్ టాక్ టైం 7.5 గంటలు. అదే స్టాండ్ బై టైమ్ మాత్రం 360 గంటలు. మొబైల్ బరువు కేవలం 94 గ్రాములు మాత్రమే. స్పైస్ క్యూటి 53కి సంబంధించిన ధరను ఇంకా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయలేదు. అదే జెన్ ఏ 60 మొబైల్ ధర మాత్రం సుమారుగా రూ 3,100గా ఉండవచ్చునని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X