ఆఫ్రికా దేశాలలో ఇండియా ఫోన్

Posted By: Super

ఆఫ్రికా దేశాలలో ఇండియా ఫోన్

దేశీయ మొబైల్ దిగ్గజం జెన్ మొబైల్స్ ఇండియాలో తక్కువ ధరలో అత్యంత ఖరీదైన మొబైల్స్‌ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు కొత్తగా జెన్ మొబైల్స్ తన ఉత్పత్తులను ఆఫ్రికా దేశాలైన నైజీరియా, కెన్యాకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటర్నెట్లో లభించిన వివరాల ప్రకారం డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్‌‍ని ఆప్రికా దేశాలలో త్వరలో విడుదల చేయనుంది. ఇది ఇలా ఉంటే త్వరలో డ్యూయల్ సిమ్ ఫోన్ జెన్ ఎమ్72ని టచ్ అండ్ టైప్ విభాగంలో మొట్టమొదటి సారి విదేశాలలో విడుదల చేయనుంది. జెన్ ఎమ్72 ఇండియాలో డ్యూయల్ సిమ్ విభాగంలో తక్కువ ధర కలిగిన మొబైల్ పోన్.

తక్కవ ధరలో మొబైల్ మార్కెట్లోకి విడుదలవుతున్న జెన్ ఎమ్72 మొబైల్ ఫోన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్స్‌లలో లభ్యమవుతుంది. ముఖ్యంగా జెన్ ఎమ్72 యూజర్స్‌కు ఉపయోగించుకునే ఫీచర్ డ్యూయల్ సిమ్. దీని వల్ల యూజర్స్ ఏ నెట్ వర్క్‌కి కావాలంటే ఆ నెట్ వర్క్‌కి ఈజీగా మారవచ్చు.జెన్ ఎమ్72 మొబైల్ వెనుక భాగంలో 1.3 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కెమెరాకి డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్ తీసేందుకు MP4, 3GP ఫైల్స్‌ని సపోర్ట్ చేస్తుంది.

ఈ మొబైల్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే యూజర్స్‌కు చక్కని బ్రౌజింగ్ ఎక్స్ పీరియన్స్‌ని కూడా అందిస్తుంది. ఇందులో ఉన్న జిపిఆర్‌ఎస్ ఫీచర్ సహాయంతో బ్రౌజింగ్‌ని చేసుకొవచ్చు. వీటితో పాటు డేటాని ట్రాన్ఫర్ చేయాలంటే ఇందులో బ్లూటూత్, యుఎస్‌బి పోర్ట్ ప్రత్యేకం. పవర్ మేనేజ్ మెంట్ విషయంలో యూజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురిచేయదు. జెన్ ఎమ్72 మొబైల్ స్టాండ్ బై టైమ్ 40 రోజులు కాగా, టాక్ టైమ్ మాత్రం 600 నిమిషాలు ఇస్తుందని తెలియజేశారు.

మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 16జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫెసిలిటీ ఉండడంతో యూజర్స్ వారికి నచ్చిన సాంగ్స్, వీడియోస్‌ని స్టోర్ చేసుకొవచ్చు. ఈ మొబైల్‌లో ఉన్న మరో డ్రాబ్యాక్ ఏమిటంటే డాక్యుమెంట్స్‌ని చదవగలిగే అవకాశం లేదు. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు గాను దీనితోపాటు 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ ధర ఇండియన్ మార్కెట్లో సుమారుగా రూ 1,999గా ఉండవచ్చునని మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot