జెన్ 3జీ ఫోన్ 'ఏ 60' అదిరింది ..

Posted By: Staff

జెన్ 3జీ ఫోన్ 'ఏ 60' అదిరింది ..

దేశీయ మొబైల్ దిగ్గజం జెన్ మొబైల్స్ మార్కెట్లో తను ఎవరికి కాంపిటేషన్ కాదు, నాకు ఎవరూ కాంపిటేషన్ లేరు అన్నట్లు వ్యవహారిస్తు ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్ మొబైల్ మార్కెట్లో అన్ని రకాల కంపెనీలకు సంబంధించిన 3జీ మొబైల్స్ స్వైర విహారం చేస్తుండగా జెన్ మొబైల్స్ కొత్తగా మార్కెట్లోకి మరో కొత్త 3జీ మొబైల్‌ని ప్రవేశపెట్టింది. దాని పేరే జెన్ ఏ 60. 3జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత మొబైల్‌లో ఇంటర్నెట్ చాలా సర్వసాధారణమై పోయింది. యాజర్స్ కూడా 3జీ మొబైల్స్‌లలో ఉన్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకోని ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొనడానికి వెనుకాడడం లేదు.

దేశంలో ఉన్న మిడిల్ క్లాస్ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని జెన్ మొబైల్స్ ఏ 60ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో జెన్ ఏ 60 తెలుపు, నలుపు కలర్స్ లలో లభ్యమవుతుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.8 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. మొబైల్ తో పాటు 78 ఎమ్‌బి మొమొరీ లభిస్తుండగా మొబైల్‌‌లో ఉన్న మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా మొమొరీని 16జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. వీటితోపాటు ప్రత్యేకంగా లైవి టివి ఆఫ్షన్ ఇందులో ప్రత్యేకం. జెన్ ఏ 60లో వీడియో కాలింగ్ ఆఫ్షన్‌తో పాటు ఇండియన్ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం మేజర్ రోల్ పోషిస్తున్న డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని కూడా కలిగి ఉంది.

ఈ మొబైల్ విడుదల సందర్బంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టెర్ మాట్లాడుతూ మూడవ జనరేషన్ మొబైల్స్‌ని విడుదల చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జెన్ ఏ 60లో ఫోటో వివర్, ఫోటో ఎడిటర్, ఫోటో ఆర్గనైజర్, వాయిస్ మొమొరీ, వాయిస్ టెక్ట్స్ లాంటి అత్యాధునిక ఫచర్స్‌ని కలిగి ఉంది. ఇవి మాత్రమే కాకుండా SMS, MMS, push mail, instant messagingలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 3.2 MP + VGA కెమెరాతో పాటు 240 X 320 ఫిక్సల్ రిజల్యూషన్ దీని సొంతం.

ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ఫేస్ బుక్, ట్విట్టర్, స్కైపీ కాల్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌తో గూగుల్ సెర్చ్, యూట్యూబ్, గూగుల్ టాక్ లాంటి వేరే ఫీచర్స్‌ని కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇన్న రకాల అత్యాధునిక ఫీచర్స్ కలిగిన జెన్ ఏ 60 మొబైల్ ధర కేవలం రూ 3249 మాత్రమే అంటే ఆశ్చర్య పోతున్నారా...

Zen A60 Key Features:

2.4 Inch Colour Screen
3G Support
3.2 MP camera at back & VGA camera for video calling at Front
Multi Format Video & Audio Player
FM Radio
78MB Internal memory
Upto 16GB Expandable memory
Bluetooth, USB
GPRS/WAP
3.5mm audio jack
Social Networking Apps – GTalk, Twitter, Facebook and Skype

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot