ఎక్కువ ఫీచర్స్ తక్కువ ఖరీదు జెన్ ఎక్స్ 414

Posted By: Staff

ఎక్కువ ఫీచర్స్ తక్కువ ఖరీదు జెన్ ఎక్స్ 414

ఇండియాలో అతి తక్కువ కాలంలో బాగా ప్రజాదరణ పోందిన మొబైల్ తయారీ దారు జెన్ మొబైల్ కంపెనీ. ఇటీవలే జెన్ ఇండియన్ మార్కెట్లోకి మూడు సిమ్‌ల జిఎస్‌ఎమ్ ఫోన్ Zen M 111 మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఇండియన్ మార్కెట్లో ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సొంతం చేసుకుంది. దీనితో పాటు ఇండియాలో ఎక్కువ మంది జనాభా మద్య తరగతి ప్రజలు కావడంతో వారి కోసం ప్రత్యేకంగా మరో కొత్త మోడల్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంది. ఈ మొబైల్‌ని ఇండియన్స్ తప్పనిసరిగా ఆదరిస్తారని జెన్ మొబైల్ కంపెనీ భావిస్తుంది. అందుకు కారణం ఈ మొబైల్ ఎక్కువ ఫీచర్స్ ఉండి, అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది కాబట్టి.

జెన్ విడుదల చేయనున్న ఈ మొబైల్ పేరు జెన్ ఎక్స్ 414. ఈ ఫోన్‌ని కంపెనీ స్వయంగా ఎంట్రీ లెవల్ ఫోన్‌ ప్రమోట్ చేస్తుంది. దీనిలో ఉన్న ఫీచర్స్ గనుక చూస్తే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మిడిల్ రేంజ్ మొబైల్‌తో సమానం అంటున్నారు కంపెనీ ప్రతినిధులు. జెన్ ఎక్స్ 414 మొబైల్ పెద్ద స్పీకర్స్‌ని కలిగి ఉండి మంచి మల్టీమీడియా ఫోన్. సౌండ్ క్లారిటీ కూడా చాలా స్పష్టంగా వస్తుంది. ఈ మొబైల్ Mp3, MP4 రెండు ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. దీని స్క్రీన్ సైజు కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక వీడియో రికార్డింగ్ ఫీచర్ కోసం ఇందులో విజిఎ కెమెరా అందుబాటులో ఉంటుంది.

జెన్ ఎక్స్ 414 మొబైల్‌తో పాటు మీకు ఇంటర్నల్ మొమొరీ లభిస్తున్నప్పటికీ మీరు మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా ఎక్సాండబుల్ మొమొరీ 16జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. జెన్ ఎక్స్ 414 మొబైల్‌తో వచ్చేటటువంటి యుఎస్‌బి కనెక్టర్ వల్ల మ్యూజిక్, పిక్టర్స్, వీడియో క్లిప్స్ లాంటి వాటిని కాపీ చేసుకునే వెసులుబాటు ఉంది. జెన్ ఎక్స్ 414 మొబైల్‌లో పవర్ పుల్ ఎల్‌ఈడి టార్చ్ కూడా అమర్చబడింది. దీని ముఖ్య ఉపయోగం ఏమిటంటే గ్రామాలలో ఉన్న ప్రజలు రాత్రిళ్లు ఎక్కడికైనా బయటకు వెళ్లాలనుకున్న సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

The notable specs of Zen X414:

Digital camera
MP4 and MP4 support
FM Radio
Big speakers
Expandable memory of up to 16 GB
Large battery backup

ఇక దీని ఖరీదు విషయానికి వస్తే కేవలం రూ 1799గా నిర్ణయించడమైంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot