జెన్ మొబైల్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్.. ధర రూ.4,999

Posted By: Prashanth

జెన్ మొబైల్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్.. ధర రూ.4,999

 

జెన్ మొబైల్ ‘జెన్ అల్ట్ర్రాఫోన్ యూ1’ పేరుతో సరికొత్త డ్యూయల్ సిమ్ అల్ట్ర్రాఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.4,999. ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జెన్ మొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ గుప్తా మాట్లాడుతూ వినియోగదారుకు సమంజసమైన ధరల్లో యూజర్ ఫ్రెండ్లీ ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తాము ప్రవేశపెట్టిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘అల్ట్రాఫోన్ యూ1’ అత్యుత్తమ ఆండ్రాయిడ్ మొబైలింగ్ అనుభూతులను చేరువచేస్తుందని అన్నారు.

‘జెన్ అల్ట్ర్రాఫోన్ యూ1’ కీలక స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల హెచ్‌విజీఏ కెపాసిటవ్ టచ్ స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

3.2 మెగా పిక్సల్ కెమెరా (ఫ్లాష్),

1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5గంటలు, స్టాండ్‌బై 144 గంటలు),

డ్యూయల్ సిమ్(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

వై-ఫై, బ్లూటూత్,

512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,

32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ.

(ప్రీలోడెడ్ ఫీచర్లు: స్కైప్, ఫేస్‌బుక్, జీ-టాక్, వాట్సాప్, మ్యాప్‌ మై ‌ఇండియా మ్యాపింగ్ సాఫ్ట్‌వేర్, నెక్స్‌జీటీవీ, గణేషా స్పీక్స్)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot