మూడు సిమ్‌ల మొబైల్ పోన్: జెన్ ఎమ్ 111

Posted By: Staff

మూడు సిమ్‌ల మొబైల్ పోన్: జెన్ ఎమ్ 111

ఇండియాలో జెన్ మొబైల్స్ గురించి తెలియని వారు ఉండరంటే నమ్మండి. అందుకు కారణం బ్రేక్ కే బాద్ సినిమాలో దీపికా పదుకుణె, ఇమ్రాన్ ఖాన్ జెన్ మొబైల్స్‌కి మంచి పబ్లిసిటీ ఇచ్చారు. అంతక ముందు వరకు జెన్ గురించి పెద్దగా తెలియకపోయినప్పటికీ బ్రేక్ కే బాద్ సినిమా ద్వారా ఇండియా మొత్తం జెన్ కంపెనీ గురించి తెలిసిపోయింది. ప్రస్తుతం ఇండియాలో చాలా పాపులర్ బ్రాండ్ మొబైల్ కంపెనీలలో జెన్ కూడా చేరింది. ఇది మాత్రమే కాకుండా ఇండియాలో మంచి డీలర్ షిప్‌ని కూడా మెయింటేన్ చేస్తుంది.

ఈ సందర్బంలో ఇండియాలో త్వరలో మూడు సిమ్ కార్డులు పోందుపరచేటటువంటి మొబైల్ పోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయనున్నామని ప్రకటించింది. ఆ మోడల్ పేరే జెన్ ఎమ్ 111. ఒకేసారి మూడు జిఎస్‌ఎమ్ నెట్ వర్క్‌లను సపోర్ట్ చేసేటటువంటి ఈ మొబైల్ ఫోన్ జెన్ కంపెనీ విడుదల చేసినటువంటి మొట్టమొదటి మూడు సిమ్‌ల మొబైల్. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో కేవలం రెండు సిమ్ కార్డులను అందించేటటువంటి మొబైల్ పోన్సే ఎక్కువ. కేవలం మూడు సిమ్‌లను దృష్టిలో పెట్టుకోని మొబైల్‌ని రూపోందించడమే కాకుండా మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కూడా ఈ మొబైల్ అందిస్తుంది.

2.4 ఇంచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండి క్యాండీ బార్ మాదిరి ఉంటుంది. ముఖ్యంగా ఈ మొబైల్ పోన్ ఇండియాలో ఉన్న యూత్‌ని దృష్టిలో పెట్టుకోని రూపోందించడం జరిగింది. యూజర్స్ కోసం ప్రత్యేకంగా ఈ మొబైల్‌తో పాటు రెండు ప్యానల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఫోన్ మల్టీమీడియా, ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా యూజర్స్‌ని నిరాశ పరచదు. కస్టమర్స్ యొక్క మూడ్‌ని బట్టి మ్యూజిక్ ప్లే చేసుకునేందుకుగాను ఇందులో 6 బ్యాండ్ ఈక్వలైజర్ పోందుపరచడం జరిగింది. ఎఫ్ ఎమ్ రేడియోతో పాటు, 3.5mm ఆడియో జాక్ దీనికి ప్రత్యేకం.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ విషయానికి వస్తే జెన్ ఎమ్ 111 బ్లూటూత్, యుఎస్‌బి పిసి సింక్‌ని సపోర్ట్ చేస్తుంది. మొమొరీని ఎక్స్ పాండబుల్ చేసుకునేందుకుగాను ఇందులో మైక్రో ఎస్‌డి కార్డు కూడా అమర్చబడి ఉంది. మంచి బ్యాటరీ బ్యాక్ అప్ దీని సోంతం.

The notable specs of Zen M 111:

Triple Sim GSM Standby
1.3 Mega Pixel Camera with video recording
Music player
FM Radio
Java
GPRS, WAP
Bluetooth

త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించనున్న దీని ఖరీదు సుమారుగా రూ 3499గా నిర్ణయించడమైంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting