ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ

Posted By: Staff

ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ

 

'జెన్ ఎమ్75' డ్యూయల్ సిమ్ మొబైల్‌ని విడుదల చేస్తూ జెన్ మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ గుప్తా మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో మొబైల్ అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. దాంతో ఏ మొబైల్ సంస్ద ఐతే కొత్త టెక్నాలజీలతో, అధునాతన ప్రత్యేకతలను కస్టమర్స్‌కి  అందిస్తుందొ వారివైపు జనాభా మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా అలాంటి ప్రత్యేకతలతో జెన్ మొబైల్ సంస్ద జెన్ ఎమ్75 అనే మొబైల్ ఫోన్‌ని విడుదల చేస్తుందన్నారు.

'జెన్ ఎమ్75' మొబైల్ 3.42మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు, డ్యూయల్ ఫ్లాష్‌ని కలిగి ఉంది. స్క్రీన్ సైజు 2.4 ఇంచ్‌లు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 16జిబి వరకు విస్తరించుకొవచ్చు. సోషల్ మీడియా అప్లికేషన్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్‌లకు డైరెక్టుగా కనెక్ట్ అయ్యేందుకు గాను ప్రత్యేకంగా బటన్స్ రూపొందించడం జరిగింది.

మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'జెన్ ఎమ్75'  మొబైల్ ధర సుమారుగా రూ 2399గా ఉండవచ్చునని నిపుణుల అంచనా. 'జెన్ ఎమ్75' మొబైల్ ప్రత్యేకతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే.....

'జెన్ ఎమ్75' మొబైల్ ప్రత్యేకతలు:

Dual SIM Mobile

2.4 inch Bright Display Screen

3.42 mega pixel Camera with Dual Flash

FM Radio

Audio Player

Video Player

Bluetooth

3.5mm Audio Jack

Expandable Memory upto 16 GB

Pre-loaded Games

Social Media Applications

Long and Slim Keypad

Calls Recording

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot