జెన్ మొబైల్ కంపెనీ డ్యూయల్ సిమ్ ఫోన్ ఎమ్72

Posted By: Super

జెన్ మొబైల్ కంపెనీ డ్యూయల్ సిమ్ ఫోన్ ఎమ్72

ఇండియన్ మొబైల్ తయారీదారు అయినటువంటి జెన్ మొబైల్ ఇండియాలో తక్కువ బడ్జెట్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. మైక్రోమ్యాక్స్, లావా స్పైస్, జెన్ కూడా ఇండియన్ మార్కెట్లో తన తక్కువ బడ్జెట్ మొబైల్స్‌ని ప్రవేశపెట్టి కస్టమర్స్ యొక్క అభిమానాన్ని చూరగోనాలని తహాతహా లాడుతున్నాయి. ఇందులో భాగంగనే జెన్ మొబైల్ తన అమ్ముల పోదినుండి ఓ సరిక్రొత్త డ్యూయల్ సిమ్ పోన్‌ని విడుదల చేస్తుంది. జెన్ విడుదల చేసేటటువంటి ఈ మొబైల్ పేరు ఎమ్ 72.

జెన్ ఎమ్ 72ని విడుదల చేసే సమయంలో జెన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ తక్కువ బడ్జెట్‌తో అన్ని రకాలైన ఫీచర్స్ ఉన్న మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలన్నదే మా ఉద్దేశ్యం అని అన్నారు. ఇక జెన్ ఎమ్ 72 గురించి చెప్పాలంటే మంచి పవర్ ప్యాక్ ఫోన్. చూడడానికి చాలా స్టయిల్‌గా ఇట్టే కస్టమర్స్‌ని తన వద్దకు రప్పించుకునేంత అందంగా ఉంటుంది. జెన్ ఎమ్ 72 డిప్లే 2.4 ఇంచ్‌లు కలిగి ఉంటుంది. మొబైల్ బాడీ ప్యానల్ రెండు కలర్స్‌లో లభ్యమవుతుంది. ఒకటి బ్రైట్ రెడ్, ఇంకొకటి వైట్. రెండు కలర్స్ ఇవ్వడానికి కారణం బ్రైట్ రెడ్ వచ్చేసి అమ్మాయిలకు అనుగుణంగా రూపోందించడం జరిగింది. అదే ఎవరైనా సింపుల్‌గా ఉండాలనుకునే వారి కోసం వైట్ కలర్ అని అన్నారు.

ఇక మల్టీమీడియా విషయానికి వస్తే ఇందులో 1.3 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు, వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. MP3, MP4 ఫైల్ ఫార్మెట్‌లను ఇందులో ప్లే చేసుకోవడానికి వీలుగా మ్యూజిక్ ప్లేయర్ ఉంది. ఎక్కడకైనా వెళ్శేటప్పుడు పాటలు వినడం కోసం ఇందులో ఎఫ్‌ఎమ్ రేడియో కూడా ఉంది. దీనితోపాటు దీనికి అదనంగా 3.5mm ఆడియో జాక్ కూడా ఇవ్వడం జరిగింది. మొబైల్ పై భాగాన డ్యూయల్ ఎల్‌ఈడి టార్చ్ లైట్ అమర్చడం జరిగింది.

Some other Zen M72 features are:

Anti theft mobile tracker
Bluetooth
Alarm clock
Sound recorder
Private data protection
Loud speaker
Hindi language support.

గతంలో విడుదలైనటువంటి తక్కువ బడ్జెట్ మొబైల్‌‌లో ఇన్ని రకాలైన ఫీచర్స్ పోందుపరచలేదు. మార్కెట్లో ఉన్న డ్యూయల్ సిమ్ ఫోన్స్‌కి ఇది తప్పకుండా పోటీని ఇస్తుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot