మార్కెట్లోకి ‘జెన్’ కొత్త స్మార్ట్‌ఫోన్

Posted By: Prashanth

మార్కెట్లోకి ‘జెన్’ కొత్త స్మార్ట్‌ఫోన్

 

జెన్ మొబైల్స్ సోమవారం దేశీయ విపణిలోకి ‘అల్ట్రాఫోన్ యూ4’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. ధర రూ.6,499. ఈ స్మార్ట్‌ఫోన్ 4.3 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లేతో కనువిందు చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టంను వినియోగించారు. నిక్షిప్తం చేసిన 1గిగాహెట్జ్ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆశించవచ్చు. 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వీడియో చాటింగ్‌కు దోహదపడుతుంది. ఎఫ్ఎమ్ రేడియో సపోర్ట్. డ్యూయల్ సిమ్ సామర్ధ్యం. వై-ఫై ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ. 3జీ సపోర్ట్ లోపించింది. ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ అప్‌గ్రేడ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఈఎస్ ఎగ్జిబిషన్‌లో ఆ హాటెస్ట్ గాడ్జెట్స్….!

జెన్ అల్ట్రాఫోన్ యూ4 కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

డ్యూయల్ సిమ్,

ఎఫ్ఎమ్ రేడియో,

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే,

1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఎడ్జ్, వై-ఫై కనెక్టువిటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot