జెన్ ఛీప్ 'డ్యూయల్ సిమ్'

Posted By: Staff

జెన్ ఛీప్ 'డ్యూయల్ సిమ్'

జెన్ మొబైల్స్ తన అమ్ముల పొదిలోకి మరొ క్రొత్త డ్యూయల్ సిమ్ మొబైల్‌ని జత చేయనుంది. దాని పేరు 'జెన్ ఎక్స్400ఐ'. జెన్ ఎక్స్400ఐ క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ మార్కెట్లోకి రానుంది. ఎవరైతే కస్టమర్స్ ఎక్కవ దూరం ప్రయాణం చేస్తారో అటువంటి వారికి రెండు సిమ్‌లు నెట్‌వర్క్ బాగా ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 1.5 ఇంచ్‌లుతో పాటు టిఎఫ్‌టి టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. ఎంటర్టెన్మెంట్ విషయంలో యూజర్స్‌ని ఆనందడొలికల్లో చేర్చేందుకు గాను వీడియో, ఆడియో ప్లే బ్యాక్‌ని అందిస్తుంది. బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం.

ఈ మొబైల్‌లో మెమరీని కేవలం 2జిబి వరకు మాత్రమే విస్తరించుకొవడం జరుగుతుంది. బ్లూటూత్, యుఎస్‌బి కనెక్షన్స్ ప్రత్యేకం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందివ్వడానికి గాను 1800 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 1,700 వరకు ఉండవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

జెన్ ఎక్స్400ఐ మొబైల్ ప్రత్యేకతలు:

* మోడల్ టైపు: Bar
* డ్యూయల్ బ్యాండ్: డ్యూయల్ సిమ్
* డిస్ ప్లే: 1.44″ 65K TFT Color Touch Screen
* డిస్ ప్లే రిజల్యూషన్: 128*128 Pixels
* డిస్ ప్లే చుట్టుకొలతలు: 105.5*45.2*15.6 MM
* బరువు: 90 Grams
* బ్యాటరీ టైపు: Li-Ion 1800 mAh
* టాక్ టైమ్: 16 Hrs
* స్టాండ్ బై టైమ్: 720 Hours
* మెమరీ: microSD support up to 2 GB
* ఇతర ప్రత్యేకతలు: FM Radio, MP3 Player

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot