రివ్యూ టైం, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎమ్1 VS రెడ్‌మి నోట్ 5 ప్రొ !

|

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇప్పుడు అన్ని కంపెనీల ఫోన్లు నువ్వా నేనా అని తలపడుతున్నాయి. వీటిల్లో షియోమి, అసుస్ లాంటి కంపెనీలయితే పోటాపోటీ ఫీచర్లతో తక్కువ ధరకే మార్కెట్లోకి ఫోన్లను తీసుకువస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు ఈ మధ్య రిలీజ్ చేసిన Zenfone Max Pro M1, Redmi Note 5 Proలు మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. ఒకే రేంజ్ ధరలో దూసుకొచ్చిన ఈ ఫోన్లు కస్టమర్లను ఏ మేర సంతృప్తిపరుస్తున్నాయి. వీటిలో ఏది కస్టమర్లకు డబ్బుకు న్యాయం చేస్తుందనే దాని మీద మీకు స్పెషల్ రివ్యూ అందిస్తున్నాం. మరి వీటి రెండిట్లో మీకు నచ్చిన ఫోన్ అలాగే మీ డబ్బులకు న్యాయం చేస్తే ఫోన్ ఏదో మీరే డిసైడ్ చేసుకోండి.

 

రూ.13,499కే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు,షియోమికి భారీ షాక్రూ.13,499కే 32 ఇంచ్ స్మార్ట్‌టీవీ, ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు,షియోమికి భారీ షాక్

Zenfone Max Pro M1 ఫీచర్లు

Zenfone Max Pro M1 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Redmi Note 5 Pro ఫీచర్లు

Redmi Note 5 Pro ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

డిస్‌ప్లే
 

డిస్‌ప్లే

ఈ రెండు డివైస్ లు 18:9 IPS LCD డిస్‌ప్లేని ఆఫర్ చేస్తున్నాయి. 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ని అందిస్తున్నాయి. కాగా రెండు ఫోన్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చాయి. కాగా Redmi Note 5 Pro గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వచ్చింది. Zenfone Max Pro M1లో ఈ ఫీచర్ లేదు. అయితే Zenfone Max Pro M1 క్వాల్ కామ్ టెక్నాలజీ బెటర్ కాంట్రాస్ట్ రేషియోతో వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా స్క్రీన్ కలర్స్ మంచి అనుభూతిని అందిస్తాయి. ఇది Zenfone Max Pro M1కి ప్లస్ పాయింట్.

Performance

Performance

రెండు ఫోన్లు 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ మీదనే వచ్చాయి. రెండింటి Performance చాలా బాగుంటుంది. అయితే ర్యామ్ విషయంలో షియోమి ఫోన్ కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇది 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్తో వచ్చింది. కాగా Zenfone Max Pro M1 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్తో వచ్చింది. కాకుంటే జెన్ ఫోన్లో మైక్రో ఎస్టీ స్లాట్ ప్లస్ పాయింట్. 2 టిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.

 కెమెరా

కెమెరా

ఈ రెండు ఫోన్లు డ్యూయెల్ కెమెరాతో మంచి క్వాలిటీని అందిస్తున్నాయి. జెన్ ఫోన్ 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)లైట్ తో రాగా 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలతో వచ్చింది. దీనిలో జోన్ ఫోన్ కొంచెం బెటర్. అయితే సెల్ఫీ షూటర్ లో షియోమిదే ఆధిపత్యం. 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో దూసుకువచ్చింది. జెన్ ఫోన్ మాత్రం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో రావడం కొంచెం నిరాశపరిచే అంశమే.

Operating system

Operating system

జెన్ ఫోన్ ఈ విషయంలో కాస్త ముందు ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియోని ఆఫర్ చేస్తోంది. అయితే షియోమి ఫోన్ మాత్రం ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపర్ చేస్తోంది. కాగా అప్ డేట్ చేసుకునే సౌకర్యం ఉండటం కొంచెం ఆనందించదగ్గ విషయం.

ధర

ధర

Zenfone Max Pro M1 3జిబి వేరియంట్ ధర రూ. 10,999గా ఉంది. అలాగే 4జిబి వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది. 6జిబి వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది.
Redmi Note 5 Pro 4జిబి వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. 6జిబి వేరియంట్ ధర రూ. 16,999గా ఉంది.
ఈ రెండు ఫోన్లు Flipkartలో లభిస్తున్నాయి. కాగా Xiaomi Redmi Note 5 Pro మాత్రం ఫ్లాష్ సేల్ లో మాత్రమే లభిస్తోంది. Zenfone Max Pro M1 ప్రీ ఆర్డర్స్ గత వారమే ప్రారంభం అయ్యాయి. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయిపోయాయి కూడా. సెకండ్ సేల్ ఈ నెల 10న జరగనుంది.

రిజల్ట్ : బడ్టెట్, ఫీచర్లు పరంగా Zenfone Max Pro M1 కొంచెం బెటర్.

 

Best Mobiles in India

English summary
Zenfone Max Pro M1 vs Redmi Note 5 Pro: Which smartphone is worth your money? more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X