మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే తయారు చేసుకోండి

కంప్యూటర్ హార్డ్‌వేర్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన Raspberry Pi గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్రెడిట్ కార్డు సైజుల ఉండే ఈ సింగిల్ బోర్డ్ కంప్యూటర్ అనేక DIY ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే తయారు చేసుకోండి

IMAGE SOURCE : hackaday

కంపాక్ట్ డిజైన్, తక్కువ ధర, తక్కువ విద్యుత్ వినియోగం వంటి విశిష్టతలను ఈ బోర్డు కలిగి ఉండటతో Raspberry Pi కంప్యూటర్ బోర్డులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతూ వస్తోంది.

ఈ ఫోన్‌ను సబ్బుతో కూడా వాష్ చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీరోఫోన్ పేరుతో ఓ ఆసక్తికర ప్రాజెక్ట్

తాజాగా, జీరోఫోన్ (ZeroPhone) పేరుతో ఓ ఆసక్తికర ప్రాజెక్ట్ Hackadayలో లిస్ట్ అయ్యింది. Raspberry Pi కంప్యూర్ బోర్డ్ ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ ఖర్చుతో మీరే ఒక స్మార్ట్‌ఫోన్‌ను చేసుకునే వీలుంటుంది.

తక్కువ ధరకు దొరికే విడిభాగాలతో...

eBay, Amazon వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లలో దొరికే విడిభాగాలతో ఈ జీరోఫోన్ ను తయారు చేసుకోవచ్చు. ఈ విడిభాగాల విలువ కూడా రూ.3,000లోపే ఉంటుంది.

IMAGE SOURCE : hackaday

Python ప్రోగ్రామింగ్

ఈ జీరోఫోన్‌లో పొందుపరిచిన యూజర్ ఇంటర్‌ఫేస్ Python ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఈ సులువైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను యాప్ డెవలప్‌మెంట్‌లో ఉపయోగించటం జరుగుతోంది.

IMAGE SOURCE : hackaday

ఆపరేటింగ్ సిస్టం

ఈ జీరోఫోన్‌కు సంబంధించి ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి DebianJessie అనే యునిక్స్ తరహా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం ను బేస్ చేసుకుని Raspbian Linuxను రూపొందించారు. ఈ ఉచిత ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేకించి Raspberry Pi కోసం ఆప్టిమైజ్ చేయటం జరిగింది.

IMAGE SOURCE : hackaday

కాల్స్, వెబ్ బ్రౌజింగ్, మ్యూజిక్ ప్లేయర్

ఈ జీరోఫోన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అలారమ్ క్లాక్, క్యాలెండర్, ఫోన్‌బుక్, ఫైల్ మేనేజర్, వెబ్ బ్రౌజర్, మ్యూజిక్ ప్లేయర్ వంటి అవసరమైన సదుపాయాలు కూడా ఉంటాయి. లైనక్స్ కంప్యూటర్ ఆధారంగా రూపుదిద్దుకునే ఈ జీరోఫోన్‌లో ARM కంపాటబుల్ యాప్స్‌ను కూడా రన్ చేసుకోవచ్చు.

జీరోఫోన్ నిర్మాణానికి అవసరమైన విడిభాగాలు..

Raspberry Pi Zero కంప్యూటర్ బోర్డ్,
SIM800 మాడ్యుల్స్
వై-ఫై నిమిత్తం ESP8266-12E
2-లేయర్ పీసీబీ
ATMega328P
ఎల్ సీడీ స్ర్కీన్,
బ్యాటరీ,
TP4056 బ్యాటరీ ఛార్జర్,
కీప్యాడ్ బటన్స్,
2.54 హెడర్స్.

పూర్తి వివరాలను తెలుసుకునేందుకు

ఈ ఫోన్‌ను అసెంబుల్ చేసే విధానంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

IMAGE SOURCE : hackaday

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ZeroPhone, An Open Source Smartphone Is Here. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot