అతిపెద్ద ప్రాసెసర్‌తో zopo ఫోన్, రూ.50,000 పోన్‌లకు పోటీ

|

ప్రపంచపు మొట్టమొదటి డెకా-కోర్ స్మార్ట్‌పోన్ జోపో స్పీడ్ 8 (Zopo Speed 8), బుధవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ధర రూ.29,999. 10 కోర్లతో కూడిన హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసారు.

అతిపెద్ద ప్రాసెసర్‌తో zopo ఫోన్, రూ.50,000 పోన్‌లకు పోటీ

Read More : లెనోవో నుంచి కొత్త ల్యాప్‌టాప్, రూ.20,490కే

డ్యుయల్ కోర్, క్వాడ్ కోర్, ఆక్టా కోర్ ప్రాసెసర్‌లతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే డెకా కోర్ ప్రాససెర్‌తో వచ్చిన ఈ ఫోన్ మరింత వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. రూ.50,000 ఖరీదు చేసే హైఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పోటీపడ గల సామర్థ్యాలను కలిగి ఉన్న జోపో స్పీడ్ 8 ఫోన్ ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం...

మల్టీటాస్కింగ్  అదరహో...

మల్టీటాస్కింగ్ అదరహో...

డెకా కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న జోపో స్పీడ్ 8 ఫోన్‌లో మల్టీటాస్కింగ్ అద్భుతంగా ఉంటుంది. మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్‌తో వస్తోన్న Zopo Speed 8 ఫోన్‌లో మల్టీటాస్కింగ్ అదరహో అనిపిస్తుంది. ఈ శక్తివంతమైన ప్రాసెసింగ్ చిప్‌సెట్‌లో 2 కార్టెక్స్ - ఏ72 కోర్స్ (క్లాక్ వేగం 2.5గిగాహెర్ట్జ్), 4 కార్టెక్స్ ఏ53 కోర్స్ (క్లాక్ వేగం 2.0గిగాహెర్ట్జ్), 4 కార్టెక్స్ ఏ53 కోర్స్ (క్లాక్ వేగం 1.4గిగాహెర్ట్జ్)ను నిక్షిప్తం చేసారు. కంప్యూటర్ తరహా వేగవంతమైన ప్రాసెసింగ్ ను ఈ ఫోన్ సమకూరస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్.

శక్తివంతమైన కెమెరా

శక్తివంతమైన కెమెరా

జోపో స్పీడ్ 8 ఫోన్, శక్తివంతమైన 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 8 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరాలతో వస్తోంది. సోనీ ఐఎమ్ఎక్స్230 సెన్సార్‌తో వస్తోన్న ఈ ఫోన్ ప్రైమరీ కెమెరాలో ఆటో ఫోకస్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ వీడియో కాలింగ్ తో పాటు పిక్షర్ పర్‌ఫెక్ట్ సెల్ఫీలను ఆస్వాదించవచ్చు.

యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌

యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌

Zopo Speed 8 ఫోన్‌, యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌తో వస్తోంది. ఈ రివర్సబుల్ కనెక్టర్ ద్వారా చార్జింగ్‌తో పాటు డేటాను వేగవంతంగా పొందవచ్చు.

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌

Zopo Speed 8 ఫోన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది. ఈ పీచర్ ఫోన్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో

Zopo Speed 8 ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

Zopo Speed 8 ఫోన్‌లో శక్తివంతమైన 4జీబి ర్యామ్‌ను పొందుపరిచారు. ఈ ఫీచర్ సపోర్ట్‌‌తో అనేక యాప్స్‌ను ఒకేసారి రన్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే 32జీబి ఇంకా 64జీబి మెమరీ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకోవచ్చు.

3,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

3,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

Zopo Speed 8 ఫోన్‌లో 3,600 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని నిక్షిప్తం చేసారు. సింగిల్ చార్జ్ పై ఈ బ్యాటరీ ఫుల్ డే బ్యాకప్‌ను మీకు అందిస్తుంది.

4జీ ఎల్టీఈ సపోర్ట్‌‌

4జీ ఎల్టీఈ సపోర్ట్‌‌

Zopo Speed 8 ఫోన్, డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్‌‌తో వస్తోంది. హై స్పీడ్ 4జీ ఇంటర్నెట్‌ను ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Zopo Speed 8 Launched in India at Rs 29,999: 8 Highlighted Features You Should Know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X