10 కోర్ సీపీయూ, 4జీబి ర్యామ్‌తో ‘జోపో స్పీడ్ 8’

Written By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ జోపో, తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Zopo Speed 8ను ఎండబ్ల్యూసీ 2016 వేదికగా లాంచ్ చేసింది. మీడియాటెక్ సంస్థ‌కు చెందిన హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా 'జోపో స్పీడ్ 8' గుర్తింపు తెచ్చుకుంది. డెకా కోర్ అంటే 10 కోర్స్ అని అర్థం.

 10 కోర్ సీపీయూ, 4జీబి ర్యామ్‌తో ‘జోపో స్పీడ్ 8’

హీలియో ఎక్స్20 ప్రాసెసర్‌తో పాటు 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 21 మెగా పిక్సల్ కెమెరా, 3,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5.5 అంగుళాల హెచ్‌డి డిస్‌‍ప్లే వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో జోపో పొందుపరిచింది. Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : అదిరే స్పెక్స్‌తో 'Xiaomi Mi 5'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

మీడియాటెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్‌తో వస్తోన్న Zopo Speed 8 ఫోన్‌లో మల్టీటాస్కింగ్ అదరహో అనిపిస్తుంది. ఈ శక్తివంతమైన ప్రాసెసింగ్ చిప్‌సెట్‌లో 2 కార్టెక్స్ - ఏ72 కోర్స్ (క్లాక్ వేగం 2.5గిగాహెర్ట్జ్), 4 కార్టెక్స్ ఏ53 కోర్స్ (క్లాక్ వేగం 2.0గిగాహెర్ట్జ్), 4 కార్టెక్స్ ఏ53 కోర్స్ (క్లాక్ వేగం 1.4గిగాహెర్ట్జ్)ను నిక్షిప్తం చేసారు. కంప్యూటర్ తరహా వేగవంతమైన ప్రాసెసింగ్ ను ఈ ఫోన్ సమకూరస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్.

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

Zopo Speed 8 ఫోన్‌లో 3,600 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని నిక్షిప్తం చేసారు. సింగిల్ చార్జ్ పై ఈ బ్యాటరీ ఫుల్ డే బ్యాకప్‌ను మీకు అందిస్తుంది.

 

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

Zopo Speed 8 ఫోన్‌ 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. ఇది Sony IMX230 సెన్సార్ కావటంతో ఫ్రోఫెషనల్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. ఆటో ఫోకస్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఆధునిక ఫోటోగ్రఫీ అవసరాలను తీరుస్తాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ వీడియో కాలింగ్ తో పాటు పిక్షర్ పర్‌ఫెక్ట్ సెల్ఫీలను ఆస్వాదించవచ్చు.

 

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

Zopo Speed 8 ఫోన్‌, యూఎస్బీ టైప్ సీ పోర్ట్‌తో వస్తోంది. ఈ రివర్సబుల్ కనెక్టర్ ద్వారా చార్జింగ్‌తో పాటు డేటాను వేగవంతంగా పొందవచ్చు.

 

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

Zopo Speed 8 ఫోన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది. ఈ పీచర్ ఫోన్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

Zopo Speed 8 ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

Zopo Speed 8 ఫోన్, డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ సపోర్ట్‌‌తో వస్తోంది. హై స్పీడ్ 4జీ ఇంటర్నెట్‌ను ఈ డివైస్ సపోర్ట్ చేస్తుంది.

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

Zopo Speed 8 ఫోన్‌లో శక్తివంతమైన 4జీబి ర్యామ్‌ను పొందుపరిచారు. ఈ ఫీచర్ సపోర్ట్‌‌తో అనేక యాప్స్‌ను ఒకేసారి రన్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే 32జీబి ఇంకా 64జీబి మెమరీ ఆప్షన్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా మైక్రోఎస్డీ కార్డ్‌‌స్లాట్ సపోర్ట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకోవచ్చు.

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

Zopo Speed 8 అమ్మకాలు చైనా మార్కెట్లో ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమవుతాయి. ధర 299 డాలర్లు. మన కరెన్సీ  ప్రకారం ఈ విలువ రూ.19,500 వరకు ఉండొచ్చు. ఇటీవల విడుదలైన వన్‌ప్లస్‌2, షియోమీ ఎంఐ‌5 ఫోన్‌లకు ఈ ఫోన్ ప్రధాన పోటీదారుగా నిలవనంది.

Zopo Speed 8 ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లు

ఎండబ్ల్యూసీ ఈవెంట్‌లో భాగంగా జోపో సంస్థ Speed 8 స్మార్ట్‌ఫోన్‌తో పాటు SPEED 7C ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ స్వాపబుల్ బ్యాక్ ప్యానల్ ఫీచర్‌తో వస్తోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Zopo Speed 8: Top 10 features of the World’s first phone with a deca-core processor!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot