అదిరిపోయే ఫీచర్లతో చైనా స్మార్ట్‌ఫోన్!

Posted By: Staff

 అదిరిపోయే ఫీచర్లతో చైనా స్మార్ట్‌ఫోన్!

 

 

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ జూపో మొబైల్ (Zopo mobile) దేశీయ విపణిలో ‘జడ్‌పి900 లీడర్’ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ రిటైల్ మార్కెట్ ధర రూ.18,999. ఇండియాన్ కస్టమర్‌లు కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లోకి లాగినై ఈ డివైజ్‌ను కొనుగోలు చేసినట్లయితే సంవత్సరం వారంటీతో రూ.15,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. కొనుగోలు పై యూజర్ లెదర్ కవర్, ట్రావెల్ చార్జర్, యూఎస్బీ డేటా కేబుల్,

హెడ్‌ఫోన్, బ్యాటరీ వంటి ఉపకరణాలను ఉచితంగా పొందవచ్చు. లింక్ అడ్రస్:

స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.....

5.3 అంగుళాల ఐపీఎస్ టీఎఫ్టీ మల్టీ-టచ్ కెపాసిటివ్ స్ర్కీన్,

డిస్‌ప్లే రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,

సరికొత్త ఎంటీకే6577 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేక ఫీచర్లు: ఎల్ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్),

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్),

డ్యూయల్ సిమ్ (సీడీఎమ్ఏ/జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

4జీబి ర్యామ్,

బుల్ట్ ఇన్ లియోన్ 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

స్టాండ్‌బై టైమ్ 120 నుంచి 180 గంటలు,

ఫోన్ శరీర కొలత 149.6×78×10.2మిల్లీమీటర్లు,

బరువు 198 గ్రాములు,

ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జెర్మన్, పోర్చుగీస్, రిష్యన్, డచ్ తదితర భాషలను ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

దేశీయంగా ఈ ఫోన్‌లను ‘ఉషా ఇన్ఫోటెక్’ పంపిణీ చేయనుంది. మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్‌ కోసం  goprobo.comలో  చూడగలరు. లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot