ఫస్ట్ ఫోన్ ఇదే, రెండు స్క్రీన్లతో Axon M, షాకింగ్ ఫీచర్లు, బడ్జెట్ ధర...

చైనా మొబైల్ దిగ్గజం జెడ్‌టీఈ దిగ్గజాలకు సవాల్ విసిరే ఫోన్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది.

By Hazarath
|

చైనా మొబైల్ దిగ్గజం జెడ్‌టీఈ దిగ్గజాలకు సవాల్ విసిరే ఫోన్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. డ్యూయల్‌-స్క్రీన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ఆక్సాన్ ఎంను అమెరికాలో విడుదల చేసింది. ఎటీ అండ్‌ టీ ద్వారా ప్రత్యేకంగా లాంచ్ చేసిన ఈ ఫోన్‌ని వినియోగదారులు మడతపెట్టి జేబులో పెట్టుకెళ్లవచ్చు.

Bharat-1తో Jio, AIrtel ఫోన్లు గల్లంతే, హైలెట్ ఫీచర్లపై ఓ లుక్కేయండిBharat-1తో Jio, AIrtel ఫోన్లు గల్లంతే, హైలెట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి

 జెడ్‌టీఈ ఆక్సాన్‌ ఎం ఫీచర్లు

జెడ్‌టీఈ ఆక్సాన్‌ ఎం ఫీచర్లు

5.2 అంగుళాల డిస్‌ప్లే, రెండు కలిపి 6.75 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్
2.15గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.1.2 నౌగట్
4జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
20 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
3180 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
3.5mm headset jack

 ఒకేసారి రెండు పనులు

ఒకేసారి రెండు పనులు

ఈ ఫోన్లో మీరు ఒకేసారి రెండు పనులు చేయవచ్చు. ఉదాహరణకు వినియోగదారులు ఒక తెరపై క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.. మరో స్క్రీన్‌ ద్వారా ఇష్టమైన పిజ్జాను ఏకకాలంలో ఆర్డర్‌ చేసుకోవచ్చు.మిర్రర్‌ మోడ్‌లో వినియోగదారులు సేమ్‌ కంటెంట్‌ను ఒకేసారి ఒకచోట కూర్చుని వీక్షించవచ్చు.

Image source :news.xinhuanet.com

అవసరం లేనపుడు టాబ్లెట్‌ మాదిరిగా..

అవసరం లేనపుడు టాబ్లెట్‌ మాదిరిగా..

అవసరం లేనపుడు టాబ్లెట్‌ మాదిరిగా పెద్ద స్క్రీన్ (6.75-అంగుళాల పూర్తి హెచ్‌డీ)పై వీడియో గేమ్‌ ఆడకోవచ్చు. మీకు రెండు స్క్రీన్లు అవసరం లేదనుకున్నప్పుడు ఒకే స్క్రీన్ లోకి మార్చుకుని గేమ్ ఆడుకునే
సౌకర్యం ఈ ఫోన్ కి ఉంది.

Image source :news.xinhuanet.com

20 ఎంపీ రియర్‌ కెమెరా

20 ఎంపీ రియర్‌ కెమెరా

ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 20 ఎంపీ రియర్‌ కెమెరాను పొందుపరిచారు..అదే కెమెరాను మీరు సెల్ఫీ కెమెరాగా కూడా వాడుకోవచ్చు. ఫోన్ మీకు అనుగుణంగా ఎటు కావాలంటే అటు అది తిరుగుతుంది.
Image source :news.xinhuanet.com

మడతపెట్టే సౌలభ్యంతో

మడతపెట్టే సౌలభ్యంతో

అంతే కాకుండా మడతపెట్టే సౌలభ్యంతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పని అయిపోయిన తరువాత మడతపెడితే మీ జేబులో ఇట్టే ఇమిడిపోతుంది. అలా మడిచినప్పుడు స్క్రీన్ ఎటువంటి డ్యామేజి కావడం జరగదు.
Image source :news.xinhuanet.com

అమెరికాలో మాత్రమే లాంచ్

అమెరికాలో మాత్రమే లాంచ్

ఈ ఫోన్ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే లాంచ్ అయింది. అక్టోబర్ 12న ప్రత్యేకంగా విడుదల చేశారు. అమెరికాలో వచ్చే నెల నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందనీ, అనంతరం , చైనా, ఐరోపా, జపాన్లతో సహా ఇతర మార్కెట్లకు కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
Image source :news.xinhuanet.com

ధర: 725 us dollars

ధర: 725 us dollars

దీని ధరను కంపెనీ 725 us dollarsగా నిర్ణయించింది. మన కరెన్సీలో ఇది దాదాపు 47 వేలు. కంపెనీ యూజర్లకు దీన్ని నెలకి 24.17డాలర్లుతో 30 నెలల ఇన్‌స్టాల్‌మెంట్ బేస్‌లో అందిస్తోంది. ఇండియాక ఎప్పుడు వస్తుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. త్వరలో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Image source :news.xinhuanet.com

అన్నింటికంటే ముందుగానే

అన్నింటికంటే ముందుగానే

ఇప్పటికే ఆపిల్ , శాంసంగ్ లాంటి కంపెనీలు మార్కెట్లోకి డ్యూయెల్ స్క్రీన్‌ ఫోన్లు తీసుకురావాలని కసరత్తు చేస్తున్నాయి. అయితే వీటన్నింటికంటే ముందుగానే జెడ్‌టీఈ కంపెనీ ఆక్సాన్‌ ఎం పేరిట రెండు స్క్రీన్ల ఫోన్‌ని లాంచ్ చేయడం విశేషం

Image source :geardiary.com

Best Mobiles in India

English summary
ZTE Axon M Foldable Smartphone With Dual Full-HD Displays Launched in U.S. more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X