'జడ్‌టిఈ కొరస్' మొబైల్ రివ్యూ

Posted By: Prashanth

'జడ్‌టిఈ కొరస్' మొబైల్ రివ్యూ

 

1985లో ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ల రంగానికి సంబంధించి ఉత్పత్తులను అందిస్తున్న జడ్‌టిఈ కార్పోరేషన్ మార్కెట్లోకి ఎప్పుటికప్పడు వైవిధ్యమైన మొబైల్స్‌ని ప్రవేశపెడుతూ తనకంటూ ఓ ప్రత్యేకతను గుర్తింపు తెచ్చుకుంది. జడ్‌టిఈ కార్పోరేషన్ కొత్తగా విడుదల చేయనున్న 'జడ్‌టిఈ కొరస్' మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ, క్రికెట్ మువి మ్యూజిక్ సర్వీస్‌ని కలిగి ఉన్న మొబైల్ ఫోన్.

'జడ్‌టిఈ కొరస్' మొబైల్ బరువు 105 గ్రాములు. చుట్టుకొలతలు 111 x 57 x14.8 mm. మొబైల్‌ని ప్లాస్టిక్‌తో కప్పిఉంచడం వల్ల మంచి లుక్‌ని సొంతం చేసుకుంది. దీనితో పాటు ఈ మొబైల్ వాడేటటువంటి యూజర్స్‌కు మరొక ప్రాబ్లమ్ కూడా ఉంది. అదేమిటంటే మొబైల్ ప్లాస్టిక్ కవర్‌తో కప్పి ఉంచడం వల్ల దుమ్ము, ధూళి మీ చేతి వ్రేళ్లకు అంటుకుంటుంది. 'జడ్‌టిఈ కొరస్' మొబైల్ ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించినట్లేతే టచ్ స్కీన్‌తో పాటు, AMOLED డిస్ ప్లేని కలిగి ఉంది. డిస్ ప్లే సైజు 3.2 ఇంచ్‌లు.

మొబైల్‌తో పాటు 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మొబైల్‌తో పాటు 256 MB RAM ప్రత్యేకం. ఈ మొబైల్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మువి మ్యూజిక్ సర్వీస్. మువి అంటే మొబైల్‌కి మ్యూజిక్‌ని అందించే ప్రొవైడర్. దీని ద్వారా మ్యూజిక్‌ని తక్కువ ధరలో యూజర్స్ పొందగలుగుతారు. మ్యూజిక్‌ని వినాలనుకునే యూజర్స్ బ్లూటూత్ మ్యూజిక్ డివైజ్ లేదా హెడ్ ఫోన్స్ ద్వారా ఈఫీచర్‌ని సద్వినియోగ పరచుకొవచ్చు.

'జడ్‌టిఈ కొరస్' మొబైల్ ప్రత్యేకతలు:

* బరువు:     105 g

* చుట్టుకొలతలు:     4.35" x 2.23" x 0.58" (111 x 57 x 14.8 mm)

* డిస్ ప్లే టైపు: LCD (Color TFT/TFD)

* డిస్ ప్లే రిజల్యూషన్: 3.2" diagonal, 240 x 400 pixels

* మెమరీ:     512 MB internal storage, 152 MB internal storage, 256 MB RAM

* బ్యాటరీ:1000 mAh LiIon

* టాక్ టైమ్: 4.2 hours max. (250 minutes)

* స్టాండ్ బై: 220 hours max. (9.2 days)

ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర ఇంకా విడుదల కాలేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot